YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మనం పాకిస్తాన్ బోర్డ‌ర్‌లో నిల‌బ‌ద్దమా?

మనం పాకిస్తాన్ బోర్డ‌ర్‌లో నిల‌బ‌ద్దమా?

న్యూఢిల్లీ ఆగష్టు 12
కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ..  దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ ప్ర‌తిప‌క్ష పార్టీలు ర్యాలీ తీశాయి. విజ‌య్ చౌక్ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు విప‌క్ష నేత‌లు ర్యాలీ తీశారు. ఆ త‌ర్వాత మీడియాతో నేత‌లు మాట్లాడారు. పార్ల‌మెంట్‌లో విప‌క్ష గొంతును ప్ర‌భుత్వం నొక్కి పెట్టింద‌ని, అందుకే ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న బాట‌ప‌ట్టిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌భుత్వం ఖూనీ చేస్తోంద‌న్నారు. వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిశాయ‌ని, 60 శాతం దేశ జ‌నాభా అస‌లు పార్ల‌మెంట్ సెష‌న్ జ‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయంలో ఉంద‌ని, 60 శాతం మంది ప్ర‌జ‌ల గొంతును నొక్కిపెట్టార‌న్నారు. రాజ్య‌స‌భ‌లో భౌతికంగా దాడి చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు.బుధ‌వారం రాజ్య‌స‌భలో మ‌హిళా ఎంపీల ప‌ట్ల మార్ష‌ల్స్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తెలిపారు. పాకిస్తాన్ బోర్డ‌ర్‌లో నిల‌బ‌డిన‌ట్లుగా ఉంద‌న్నారు.

Related Posts