YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఐపీఎల్ సందడి షురూ

ఐపీఎల్ సందడి షురూ

ముంబై, ఆగస్టు 13, 
ధనాధన్‌‌‌‌ టీ20 లీగ్‌‌‌‌.. ఐపీఎల్‌‌‌‌ సందడి మళ్లీ మొదలైంది. సెప్టెంబర్‌‌‌‌ 19 నుంచి ఐపీఎల్‌‌‌‌–14 ఫేజ్‌‌‌‌–2 మ్యాచ్‌‌‌‌లు యూఏఈ వేదికగా జరగనున్నాయి. టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో ఫ్రాంచైజీలు కూడా ఏర్పాట్లలో  స్పీడ్‌‌‌‌ పెంచాయి. తర్వాత ఎప్పుడైనా ఫ్రాంచైజీలు అరబ్‌‌‌‌ గడ్డకు వెళ్లవచ్చని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అన్ని జట్లు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. అయితే అందరి కంటే కాస్త ముందుగా  చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ యూఏఈ వెళ్లేలా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే కెప్టెన్‌‌‌‌ ధోనీ  తమ టీమ్‌‌‌‌తో కలిశాడు. ధోనీతోపాటు సురేష్రైనా, రాబిన్‌‌‌‌ ఊతప్ప, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, కరణ్‌‌‌‌ శర్మ, కేఎం ఆసిఫ్‌‌‌‌ తదితరులు చెన్నైలో ఏర్పాటు చేసిన క్యాంప్‌‌‌‌కు చేరుకున్నారు. బుధవారం మరికొందరు జట్టుతో కలిసే అవకాశముంది. దుబాయ్‌‌‌‌ బేస్‌‌‌‌గా ఉండనున్న సీఎస్‌‌‌‌కే 13 లేదా 14వ తేదీల్లో అక్కడకు బయలుదేరనుంది. జట్టులో ఎక్కువ మంది రిటైర్డ్‌‌‌‌ ప్లేయర్లు ఉండటంతో చెన్నై ప్రతీసారి ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ను అందరికంటే ముందుగా స్టార్ట్‌‌‌‌ చేస్తుంది. ఐపీఎల్‌‌‌‌–14 తొలి ఫేజ్‌‌‌‌ అప్పుడు కూడా లీగ్‌‌‌‌ ప్రారంభానికి  నెల రోజుల ముందే క్యాంప్‌‌‌‌  ఏర్పాటు చేసింది. పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ ఆగస్టు 29న యూఏఈ బయలుదేరేలా ప్లాన్స్‌‌‌‌ సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క వీలైనంత త్వరగా యూఏఈలో తమ బేస్‌‌‌‌ను ఏర్పాటు చేసుకోవాలని నన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ కూడా ప్రణాళికలు వేస్తోంది. న్యూజిలాండ్‌‌‌‌  ప్లేయర్లు యూఏఈలో జరిగే ఐపీఎల్‌‌‌‌ బరిలోకి దిగడం ఖాయమైంది. ఐపీఎల్‌‌‌‌ జరిగే టైమ్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌.. లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల సిరీస్‌‌‌‌ల కోసం బంగ్లాదేశ్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌లో పర్యటించాల్సి ఉంది. దీంతో కివీస్‌‌‌‌ ప్లేయర్లు లీగ్‌‌‌‌లో ఆడటంపై ఇన్నాళ్లూ అనుమానాలుండేవి. కానీ, టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌తోపాటు బంగ్లా, పాక్‌‌‌‌ టూర్లకు కివీస్‌‌‌‌ బోర్డు మంగళవారం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది.

Related Posts