YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సెప్టెంబర్ లో స్కూల్స్...

సెప్టెంబర్ లో స్కూల్స్...

హైదరాబాద్, ఆగస్టు 13, 
తెలంగాణాలో పాఠశాలలు రీ- ఓపెన్ కానున్నాయి. వచ్చే నెల ఒకటవ తారీఖు నుంచి పాఠశాలలు రీ- ఓపెన్ చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎనిమిదవ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. విడతల వారీగా తరగతులు ప్రారంభించాలని యోచిస్తోంది సర్కార్‌.వివిధ రాష్ట్రాల్లో స్కూల్స్ ఓపెన్ చేసేందుకు అమలు చేసేందుకు అనుసరిస్తున్న విధానాలు స్టడీ చేస్తోంది కేసీఆర్‌ సర్కార్‌. ఇక అటు ఆగస్ట్ 30 వరకు ఇంటర్ అడ్మిషన్ ల గడువు ను పెంచింది తెలంగాణ సర్కార్‌. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అదుపులో నే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 482 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణ లో 8137 కరోనా కేసులు యాక్టివ్‌ లో ఉన్నాయి.
15 తర్వాత ఇంటర్ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సెప్టెంబర్ 15 నుండి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కరోనా విజృంభణతో పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమోట్ అయిన ప్రతి సెకండియర్ విద్యార్థి మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే అని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దయినా ఫస్ట్ ఇయర్ మార్కులు ఆధారంగా పాస్ చేయవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts