YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’... ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’... ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’... ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. వ‌రుస సినిమాల‌ను రూపొందిస్తోన్న రాబోయే రోజుల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిల‌వ‌డానికి ప్లాన్ చేసుకుంది. ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డానికి కొంద‌రు సంప్ర‌దించిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు ఆఫ‌ర్స్‌ను వ‌ద్ద‌ని, థియేట‌ర్స్‌లోనే అస‌లు కిక్ ఉంటుంద‌ని భావించి ‘హౌస్ అరెస్ట్‌’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
‘90 ఎం.ఎల్’ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవిబాబు, అదుర్స్ రఘు, రవి ప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. జె.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, చంద్ర‌బోస్ లిరిసిస్ట్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
న‌టీన‌టులు: శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు

Related Posts