YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాబూల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేసిన భార‌త్ ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చిక్కుకున్నవారికోసం ఎమ‌ర్జెన్సీ వీసా ప్రకటించిన ఇండియా

కాబూల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేసిన భార‌త్ ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చిక్కుకున్నవారికోసం ఎమ‌ర్జెన్సీ వీసా ప్రకటించిన ఇండియా

కాబూల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేసిన భార‌త్
ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చిక్కుకున్నవారికోసం ఎమ‌ర్జెన్సీ వీసా ప్రకటించిన ఇండియా  
న్యూఢిల్లీ ఆగష్టు 17
ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వ‌ర‌గా ఇండియాకు ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ఎమ‌ర్జెన్సీ వీసా ప‌ద్ధ‌తిని ప్ర‌క‌టించింది. ఫాస్ట్ ట్రాక్ ప‌ద్ధ‌తిలో ఇండియాలో ఆశ్ర‌యం పొందాల‌నుకునేవారికి ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్నారు. కేంద్ర హోంశాఖ ఆ వీసాల‌ను జారీ చేయ‌నున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్ చేరుకోవాల‌నుకునేవారికి ఆ వీసా ద్వారా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే హిందువులు, సిక్కుల‌కు ఈ-వీసాలో తొలి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్ సంక్షోభంపై ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడారు. ఆఫ్ఘ‌న్ శ‌ర‌ణార్థుల‌కు ప్ర‌పంచ దేశాలు ఆశ్ర‌యం క‌ల్పించాల‌న్నారు. ఆఫ్ఘ‌న్ శ‌ర‌ణార్ధుల‌ను అన్ని దేశాలు ఆహ్వానించాల‌ని, వారిని డిపోర్ట్ చేయ‌రాదు అని ఆయ‌న ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని దేశాలు ఆశ్ర‌యం క‌ల్పించేందుకు అంగీక‌రించాయి. 20 వేల మంది పేద ఆఫ్ఘ‌న్ల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌నున్న‌ట్లు కెన‌డా చెప్పింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ ఫైట‌ర్లు చేజిక్కించుకున్న నేప‌థ్యంలో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాది సంఖ్య‌లో జ‌నం కాబూల్ విమానాశ్ర‌యానికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో అయిదుగురు మ‌ర‌ణించారు.మ‌రోవైపు కాబూల్‌లో భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని మూసివేన‌ట్లు భార‌త్ ప్ర‌క‌టించింది.

Related Posts