YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఛలాన్లా మార్ఫింగ్ తో నాలుగు లక్షలు స్వాహ

ఛలాన్లా మార్ఫింగ్ తో నాలుగు లక్షలు స్వాహ

నర్సీపట్నం
సంచల సంసృష్టించిన రిజిస్ట్రేషన్ నకిలీ చలానాలు వ్యవహారం లో మరో 29 చలానాలు మార్ఫింగ్ చేసి నాలుగు లక్షల 15 వేల 639 రూపాయలను డాక్యుమెంట్ రైటర్ లక్కోజు  జగదీష్ స్వాహా చేశారని ఇంచార్జ్ రిజిస్టర్ శ్రీకాంత్ తెలిపారు.  మొత్తం ఏడు లక్షల 91 వేల 965 రూపా యలను జగదీష్ స్వాహా చేశారని అతన్నుంచి ఐదు లక్షల రూపాయలను రికవరీ చేసామని పేర్కొన్నారు. నర్సీపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీ సులో పూర్తిస్థాయిలో అన్ని చలనాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు. 2018లో ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానాలు కట్టడానికి అవకాశం ఇచ్చిందని దీనిని ఆసరాగా చేసుకునిజగదీష్ తప్పుడు పనులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ "కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో అని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనూ జరిగిన తనిఖీల్లో నర్సీపట్న లో ఈ విషయం బయటపడిందని కంప్యూటర్ నాలెడ్జ్వ గాహన ఉన్న జగదీష్ తప్పుడు పని చేశాడని పేర్కొన్నారు.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న జగదీష్ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన పూర్తి స్థాయి తనిఖీలలో చిట్టా మొత్తం బయటకు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నచలానాల విధానంలో లోపాలు సరి చేసి మార్పులు చేసిందని దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదని పేర్కొన్నారు. సొమ్ము రికవరీ చేసినప్పటికీ పోలీస్ కేస్ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్లు ఆయన తెలిపారు. అలాగే బుధవారం నుంచి యధావిధిగా నర్సీపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్రయవిక్రయ లావాదేవీలు కొనసాగుతాయని ఇన్చార్జి రిజిస్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు.

Related Posts