YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వాక్సినేషన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి పారిశుద్ధ్యం పై నిత్య పర్యవేక్షణ చేయాలి  కమిషనర్ గిరీషా

వాక్సినేషన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి పారిశుద్ధ్యం పై నిత్య పర్యవేక్షణ చేయాలి  కమిషనర్ గిరీషా

వాక్సినేషన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి
పారిశుద్ధ్యం పై నిత్య పర్యవేక్షణ చేయాలి
 కమిషనర్ గిరీషా
తిరుపతి, ఆగస్టు 18

కోవిడ్ వాక్సిన్ వేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రజలందరు తప్పకుండా వాక్సిన్   వేయించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ గిరీషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం కృష్ణాపురం వద్ద 28  డివిజన్ కు చెందిన  1,2, సచివాలయాలు, 32 వ డివిజన్ కు చెందిన 1,2 సచివాలయాలను కమీషనర్ తనిఖీ చేశారు. ఆయా విభాగాల సెక్రటరీ లతో మాట్లాడి పన్నులు ఈ మేరకు వసూలు చేశారు, ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కరించారు, వాక్సినేషన్ ఎంత చేశారు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాలంటీర్, సంబంధిత కార్యదర్శి తో సమన్వయ పరుచుకుని చక్కగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాక్సినేషన్ వేసుకొని వారిని గుర్తించి, వారికి వాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలను వివరించి వాక్సిన్ వేయాలన్నారు. 100 శాతం పూర్తి చేయాలన్నారు. శానిటరీ, అడ్మిన్ సెక్రెటరీలు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉండేలా చూడాలన్నారు. ఎక్కడ పారిశుద్ధ్యం లోపిస్తే ఆ కార్యదర్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సకాలంలో పన్నులు వసూలు చేయాలన్నారు. విధుల్లో ఆశ్రద్ద వహించకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి వారికి అవి అందేలా చూడాలన్నారు.  మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే సంబంధించిన అధికారులకు తెలిపి పరిష్కరించాలన్నారు. అలాగే మీ వార్డులోని కార్పొరేటర్ల సహాయం కూడా తీసుకుని విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.
కమిషనర్ వెంట కార్పొరేటర్లు పొన్నాల చంద్ర,  ఆరణి శైలజా సెక్టోరల్ ఆఫీసర్స్ కరుణాకర్, హరికృష్ణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Related Posts