YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

సిబిఐ పంజ‌రంలో చిలుక కాదు ..స్వేచ్ఛ‌గా వ‌దిలేయండి. మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

సిబిఐ పంజ‌రంలో చిలుక కాదు ..స్వేచ్ఛ‌గా వ‌దిలేయండి. మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

సిబిఐ పంజ‌రంలో చిలుక కాదు ..స్వేచ్ఛ‌గా వ‌దిలేయండి
             మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
చెన్నయ్ ఆగష్టు 18
దేశంలో అత్యున్న‌త విచార‌ణ సంస్థ సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(సిబిఐ) అయితే ఇది కేంద్ర ప్ర‌భుత్వం చేతుల్లో పావుగా మారిపోయింద‌న్న విమ‌ర్శ‌ల నేపద్యం లో తాజాగా దీనిపై మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సీబీఐ క‌చ్చితంగా ఓ స్వ‌తంత్ర సంస్థ‌లా ప‌ని చేయాల‌ని, అది కేవ‌లం పార్ల‌మెంట్‌కు మాత్ర‌మే రిపోర్ట్ చేయాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అధికారంలో ఉన్న వాళ్ల‌కు ప్ర‌త్య‌ర్థుల‌ను వేటాడేందుకు ఇదో ఆయుధం అన్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. కేవ‌లం పార్ల‌మెంట్‌కే జ‌వాబుదారీగా ఉండే కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (కాగ్‌)లాగే సీబీఐకి కూడా స్వేచ్ఛ‌గా ప‌నిచేసే అవ‌కాశం ఉండాల‌ని కోర్టు చెప్పింది. అయితే ఇప్ప‌టికైనా ఈ పంజ‌రంలో చిలుక (సీబీఐ)ని స్వేచ్ఛ‌గా వ‌దిలేయాన్న ప్ర‌య‌త్న‌మే ఈ త‌మ ఆదేశాలు అని హైకోర్టు అన‌డం గ‌మ‌నార్హం.

Related Posts