YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

'బాహుబలి' లో రాజమౌళి ఏం చూపించాడో  "బజార్ రౌడీ" లో నేను అదే చూపించాను - దర్శకుడు వసంత నాగేశ్వర రావు

'బాహుబలి' లో రాజమౌళి ఏం చూపించాడో  "బజార్ రౌడీ" లో నేను అదే చూపించాను - దర్శకుడు వసంత నాగేశ్వర రావు

'బాహుబలి' లో రాజమౌళి ఏం చూపించాడో  "బజార్ రౌడీ" లో నేను అదే చూపించాను - దర్శకుడు వసంత నాగేశ్వర రావు
బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మహేశ్వరి,లోరాని హీరోయిన్స్ గా నటించిన చిత్రం "బజార్ రౌడీ". ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20 న 300 థియేటర్స్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల వుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు ఇంటర్వ్యూ...
 మీ సినీ నేపథ్యం ?
-- మా ఫ్యామిలీస్ లో ఎవ్వరు కూడా సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళు లేరు ,నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం ,ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ రావాలనేది నా కోరిక దాంతో నేను 10 వ తరగతి తర్వాత మద్రాస్ కు వెళ్లాను. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరువాత కొంతమంది పరిచయాలతో "విషకన్య" సినిమాకు అప్రెంటిస్ గా చేరాను. ఆ తర్వాత పద్మాలయా స్టూడియో లో చేరాను. హీరో కృష్ణ, పి.సి రెడ్డి, వి.మధు సూదనరావు , వి.బి.ఎల్ వి ప్రసాద్ , దర్శకరత్న దాసరి, భరత్, ఏ మోహన్ గాంధీ ఇలా నేను చాలా మంది గురువుల దగ్గర దర్శకత్వ శాఖలో మెలుకువలు నేర్చుకున్నాను. చాలా రోజులు నేను పద్మాలయ లో వర్క్ చేసినందున అందరూ నన్ను ఇప్పటికీ పద్మాలయ నాగేశ్వరరావు అంటారు. 2010 లో వడ్డే నవీన్ తో "ఆంటీ అంకుల్ నందగోపాల్" సినిమాను చేశాను. కన్నడలో ఒక సినిమా చేశాను
 ఈ కథ ఏ హీరో కైనా చెప్పారా ? ఈ సినిమా  సంపూర్ణేష్ బాబు తోనే చేయాలని ఎందుకు అనిపించింది ?
-- ఈ కథ ఏ హీరోకు చెప్పలేదు. నా మిత్రుల సలహా మేరకు సంపూతో సినిమా చేస్తే సేఫ్ ప్రాజెక్టు ఉంటుందని  నా ఫ్రెండ్ శేఖర్ ద్వారా సంపూ ను కలసి కథ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ గా ఉందని హీరో సంపూర్ణేష్ బాబు గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత శేఖర్ గారే నిర్మాత సంది రెడ్డి శ్రీనివాస రావును కూడా  పరిచయం చేయడం జరిగింది.ఈ కథ నిర్మాత కు కూడా నచ్చడంతో మా ప్రాజెక్టు స్టార్ట్ అయింది.
 ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ను డిఫ్రెంట్ గా చూపించి నట్లున్నారు ?
-- సంపూ గారితో నేను చేసే సినిమా డిఫ్రెంట్ గా ఉండాలని ఫీల్ అయ్యి ఈ  కథ రాశాను. తను ఇప్పటివరకు చేసిన హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి టైటిల్స్ కు భిన్నంగా "బజార్ రౌడీ" అని  పెడితే  ఫ్యాన్స్ అందరూ కూడా డిఫరెంట్ గా ఫీలవుతారని ఈ టైటిల్ పెట్టడం జరిగింది.
 ఈ సినిమాకు బజార్ రౌడీ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి ?
-- మేము ఈ టైటిల్ని ఫ్యాషన్ కోసమో లేక క్రేజ్ కోసమో పెట్టలేదు.
కథకు 100%  యాప్ట్ ఉండడం వల్లే ఈ టైటిల్  పెట్టడం జరిగింది. ఈ సినిమాలో సంపూ బజార్ రౌడీ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.
 సంపూర్ణేష్ బాబు గత సినిమాలన్నీ హిలేరియస్  కామెడీ ఉంటుంది ఇందులో ఎంతవరకు కామెడీ ఉంటుంది?
-- ఇందులో తను కామెడీ  ఎక్కడ మిస్ కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఎక్కడా మిస్ కాకుండా  ఉంటుంది. సంపు గారు చేసిన గత సినిమాల మాదిరి చేయకుండా తనలో కూడా ఒక మంచి నటుడున్నాడు. తనలోని నటున్ని బయటకు తీసుకు వద్దామని డీఫ్రెంట్ గా ఈ సినిమాలో సంపూను చూపెట్టడం జరిగింది.
 సంపూర్ణేష్ బాబు ఇందులో  డబుల్ యాక్షన్  చేస్తున్నాడా ?
-- సంపూ గారు ఇందులో డ్యుయల్ రోల్ చేయట్లేదు కానీ   డబుల్ షేడ్ ఉంటుంది. ఇందులో అన్నగారు ఎన్టీఆర్ గారి బొబ్బిలి పులి గెటప్ వేయడం జరిగింది అదే ఈ సినిమాకు టర్నింగ్ పాయింట్.
 ట్రైలర్ చూస్తుంటే సంపూర్ణేష్ బాబు యాక్షన్ సీన్స్ కు మంచి ఆప్లాజ్ వస్తుంది మీకెలా అనిపిస్తుంది?
-- సంపూ గారు ఎలాంటి సినిమాలైనా చేస్తాడు అనేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో హీరోకు ఇద్దరు అత్తలు, ముగ్గురు మరదళ్లు, ఒక హీరోయిన్ ఉంటుంది . కామెడీతో పాటు ఇందులో డ్యాన్, ఫైట్స్ సీన్స్ చేయించాము. సంపూ ని యాక్షన్ హీరోగా గత సినిమాల కంటే భిన్నంగా ఇందులో చూపించడం జరిగింది. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, స్వర్ణ మాస్టర్స్ దగ్గర 20  రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయడంతో ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది.  ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆశ్చర్య పోయేలా వుండే ఈ సినిమాను అభిమానులు తెలుగు ప్రేక్షకులు 100% ఆదరిస్తారు
 నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు గురించి ?
-- నిర్మాతకిది మొదటి సినిమా అయినా..100 సినిమాలు తీసిన నిర్మాతకు ఎంత అనుభవం ఉంటుందో ఈ మొదటి సినిమాతోనే అంత అనుభవం ఉన్న నిర్మాతలా . ప్రతిదీ క్లీన్ అబ్జర్వేషన్ చేశాడు. కొబ్బరికాయ కొట్టినప్పటినుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు అన్నిటిలో అవగాహన పెంచుకున్నాడు. ఒక రైతుగా  వుంటూ మంచి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న కూడా సినిమా మీద మక్కువతో ఈ సినిమా చేయడం జరిగింది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా అవసరం.
 ఈ సినిమాకు పాటలు ఎంతవరకు ప్లస్ అవుతాయి?
--సాయికార్తీక్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఇందులో మూడు పాటలు ఉంటాయి. నాలుగో పాటను టైటిల్  పైన ఉంటుంది . మూడు కూడా అద్భుతంగా వచ్చాయి .కథను డిస్టర్బ్ చేయకుండా పాటలు ఉన్నాయి.
 హీరోయిన్  గురించి ?
--హీరోయిన్ మహేశ్వరి తెలుగు అమ్మాయి కూచిపూడి నాట్యం బాగా చేస్తుంది. కూచిపూడి నాట్యానికి ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు కూడా అందుకుంది. తనకిది మొదట సినిమా అయినా చాలా చక్కగా నటించింది .దర్శకుడు చెప్పిన దానికంటే చాలా మంచి బెటర్మెంట్ ఇచ్చింది ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.
 ఎంతో మంది సీనియర్ దర్శకుల దగ్గర పని చేసిన మీరు  దర్శకుడిగా మారడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది?
-- ఇంతకు ముందు నేను కొన్ని సినిమాలు  చేశాను. ఇప్పుడు సంపూ తో చేశాను. కానీ నాకంటే మేధావులు చాలా మంది సీనియర్స్ స్క్రిప్ట్స్ పట్టుకొని దర్శకుడిగా మారాలని పట్టువదలని విక్రమారుల్లా ఫిలింనగర్ నగర వీధుల్లో అవకాశాల కోసం తిరుగుతున్నారు అంటే వారి కంటే నేను బెస్ట్ అనుకుంటున్నాను.ఇంతకు ముందు  పెద్ద నరేష్ గారితొ "ఎవరిది ఈ తప్పు" అనే సినిమాను మొదలు పెట్టాను.ఆ తర్వాత 2010 లో వడ్డే నవీన్ తో "ఆంటీ అంకుల్ నందగోపాల్", కన్నడలో ఒక సినిమా చేశాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఇవిచాలు నా జీవితానికి.
 "బజార్ రౌడీ' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది ?
సుమారు 300 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది.కరోనా మూలంగా అన్ని సినిమాలు ఆగిపోయాయి.కానీ ప్రేక్షకులు మాత్రం సినిమా హాల్స్ తెరిస్తే మేము వస్తామని ఈమధ్య విడుదలైన సినిమాలతో నిరూపించారు. ఆ సినిమాలలాగే ఈ నెల 20 న వస్తున్న  మా "బజార్ రౌడీ" చూసిన ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రేక్షకులు అందరూ వచ్చి మా సినిమాను ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
 మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
 ఒక కొత్త కథ తయారు చేసుకున్నాను.  సంపూ తోనే కత్తుల రత్తయ్య గా ఇంకొక కథ రెడీ చేసుకున్నాను. ఆయన ఆల్రెడీ నాలుగు సినిమాలు కమిట్మెంట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ మధ్యలో నేను ఇంకొక డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తున్నాను.ఈ విషయాలన్నీ ఈ సినిమా విడుదల తర్వాత తెలియజేస్తాను.

Related Posts