YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ సింధు శర్మ

నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ సింధు శర్మ

నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి
కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి
జిల్లా ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల ఆగస్టు 19
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ  సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి  సూచనలు ఇవ్వాలని కోరారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతిరోజు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ పెట్టి కేసులు నమోదు చేయాలని తెలిపారు. నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సిసి కెమెరాలు నేను సైతం అనే కార్యక్రమం ద్వారా  ప్రజలకు అవగాహన కల్పించి  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజల నగదును దోచుకోవడానికి యత్నిస్తున్నారని,ఇట్టి నేరగాళ్ల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన వెంటనే 155260/డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న వాహనాలకు సంబంధించి యజమానులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని, కోర్టు ద్వారా వాహనాల క్లియరెన్స్ కోసం అవసరమైన అన్ని రకాల నిబంధనలు విధిగా పాటిస్తూ సీజ్ చేయబడిన వాహనాలు, దీర్ఘకాలంగా పోలీస్ స్టేషన్లలో వదిలేయబడిన వాహనాల విషయంలోనూ వాటి యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మెట్పల్లి డీఎస్పీ గౌస్ బాబా, డీసీఆర్బీ డీఎస్పీ రాఘవేంద్రరావు, సి.ఐ లు రాజశేఖర్ రాజు,శ్రీను,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, ఎస్.ఐ లు ఐటీ కోర్  డీసీఆర్బీసిబ్బంది పాల్గొన్నారు.

Related Posts