YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా

ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలా

సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే.. అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే.. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. 

పూజలో ఉపయోగించిన అక్షంతలని ఒకచోట దాచుకుని ప్రయాణాలకి వెళ్లే వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లెటప్పుడు తలపై వేసుకుని బయల్దేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఎవరైనా మనకి పాదాభివందనం చేస్తే.. వాళ్లని ఆశీర్వదించడానికి కూడా వాడొచ్చు.

పూజామందిరంలో దైవాన్నే ఉంచి పూజించాలి తప్ప మన బంధువుల, తల్లిదండ్రులు.. ఇలా ఎవరి చిత్రాలను ఉంచి పూజించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. పూజ గదిలో దైవాన్ని తప్ప వేరే ఎవ్వరని ఆరాధించరాదని చెప్తున్నారు. కనుక దైవారాధనకు మాత్రం ఓ ప్రశాంతమైన గదిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీరు చేయాలనుకున్న పూజ కార్యలు సక్రమంగా జరుగుతాయి.

తనంత తానుగా వెలసిన మూలవిరాట్టు పుంగవులచే ప్రతిష్టమైన, మూలవిరాట్టుండి, ప్రవహించే నది ఒడ్డున ఏ దేవాలయంలో కనిపిస్తుందో దానిని క్షేత్రమని అంటారు. అలా కానిది దేవాలయం. ఇక శిఖరం, ధ్వజస్తంభం అనేవి లేనిది మందిరం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts