YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దక్షిణ దిక్కుకు పరిపాలకుడు 'యమ ధర్మరాజు.

దక్షిణ దిక్కుకు పరిపాలకుడు 'యమ ధర్మరాజు.

అష్టదిక్పాలకులలో మూడవవాడు 'అగ్నిదేవుడు'. దక్షిణ దిక్కుకు పరిపాలకుడు. . ! యముడు అనే మాటకు 'నియంత్రించువాడు' అని అర్థం. - - - - -

ఓం యమాయ నమఃమన వైదిక వాజ్మయంలో ఆదిత్యుని యముడని, నిరుక్తంలో అగ్నిని యముడని పేర్కొన్నారు. అలాగే మన పురాణేతిహాసాలు యముడిని 'ధర్మరాజు' అని అభివర్ణించాయి. అమరకోశం నిర్వచనం .

యమయతీతి యమః - యముడు అంటే దండించువాడు అని అమరకోశం నిర్వచించింది. అలాగే యమున (యమీ)తో పాటు కవలగా పుట్టినవాడు యముడు. అపరాధానికి తగినట్లు శిక్షించు వాడు. అందుచేత ధర్మానికి రాజు (అనగా ప్రభువు) కనుక ధర్మరాజు అని యమునకు పేరు వచ్చింది.

యమధర్మరాజు కాలదండమనే దండాన్ని ధరించినవాడు కనుక దండధరుడు. ధర్మాధర్మాలనైనా, ఆయువునైనా లెక్కపెట్టువాడు కనుక - కాలుడు. సకల ప్రాణికోటిపై పక్షపాతం లేకుండా సమంగా చూసే స్వభావం కలవాడు కనుక సమవర్తి. ప్రాణులను శమింపజేయువాడు కనుక శమనుడు. వినాశనం కలిగించేవాడు కనుక అంతకుడు. .

• పితృదేవతలకు అధిపతి కనుక పితృపతి. పరేతులనగా మృతి చెందినవారు. వీరికి ప్రభువు కనుక 'పరేతరాట్'. శ్రాద్ధమనగా పితృ . కర్మానికి దేవుడు కనుక శ్రాద్ధదేవుడు.

వివస్వతుడైన సూర్యునకు కుమారుడు కనుక వైవస్వతుడు. యమునానదికి తోడబుట్టినవాడు. కనుక 'యమునాభ్రాతా' యముడు. వివస్వతుడైన యముడు దక్షిణ దిక్కును పరిపాలించువాడు. కాలాన్ని శాసించువాడు. అటువంటి యమధర్మరాజు సంపూర్ణమైన ఆరో గ్యంతో, వేదోక్తమగు దీర్ఘాయువును మనకు ప్రసాదించుగాక.

అచ్చ తెలుగు పదాలు - జముడు : జముడు - వికృతి, యముడు - ప్రకృతి. జమునకు సైదోడు : యమునకు తోడబుట్టినవాడు. యమునా భ్రాతా. పితరుల సామి : పితృదేవతలకు ప్రభువు. పితృపతి. ప్రొద్దుకొమరుడు (కూన) : సూర్యుని కుమారుడు. వైవస్వతుడు. మిత్తి : మృత్యుశబ్దం నుండి వచ్చింది. అంతకుడు. . పోతుజక్కినెక్కి తిరిగెడి బలురౌతు : దున్నపోతునెక్కి తిరిగెడి బలిమిగల . దిట్టరి. మహిషవాహనుడు. - (46)

............. దక్కిణంపు సామి : దక్షిణదిశను ఏలువాడు. దక్షిణ దిక్పాలకుడు. en పితృపతి యముడు anae .

యమధర్మరాజు పితృదేవతలలో ప్రప్రథముడు. అంటే ఈ ప్రపంచంలో ముందుగా మరణించినవారిలో మొట్టమొదటివాడు. అందువలన చనిపోయిన వారందరికీ పెద్దగా మారాడు. ప్రేతాధిపతి యముడు. ప్రేతమనగా ఈ లోకం నుండి పోవువాడు. ప్రకృష్టమైన దశను పొందినవాడు. పోయిన ప్రాణం కలవాడు. పితృలోకానికి

యముడే అధిపతి. కనుక దండధరుడైనాడు. on నరకము - యముడు . ...నరకమనగా పాపాత్ములకు తన సమీపాన్ని పొందించునది. దుష్టమైన గతి కనుక దుర్గతి అని పేరు. దీనిలో నరులు 'మొరపెట్టుకొంటారు. నరకలోకంలో తామిస్ర, అంధతామిస్ర, రౌరవ, మహారౌరవ, కాలసూత్ర, అంధకూప, క్రిమిభోజన, వజ్రకంటక అనే నరకయాతనలను పాపులు అనుభవించవలసి ఉంటుందని పురా ణాలు పేర్కొంటున్నాయి.

' మరణానికి యముడే కారణకుడని లోకంలో ప్రతీతి. కాని మన ఆర్షవాజ్మయంలో యమునకు, ఆయుష్షుకు సంబంధం లేదు. ఆయష్షును ప్రసాదించేవాడు ప్రజాపతియైన బ్రహ్మదేవుడు.

పురాణకాలంలో - యముడు

వైదిక వాజ్మయంలో యమ ధర్మరాజు ఆజ్ఞకు తిరుగులేదు. ద్యులోకానికి రాజు అని ఋగ్వేదం వివరిస్తోంది. త్రిలో కాలలో రెండు సూర్యుడికి, ఒకటి యముడికి సంబంధిం చినవి.

పురాణకాలంలో సత్య వంతుని భార్య, పతివ్రతయైన

సావిత్రీదేవి; .మరుద్వతీ -

మృకండ మహర్షుల పుత్రుడు, 

శివభక్తుడైన మార్కండేయుడులు యమ . ధర్మరాజు కళ్ళు తెరిపించారు.

జ్ఞానోదయం : కలిగించారు. కాలక్రమంలో యముడు కేవలం దిక్పాలకుడయ్యాడు. . యమదీపం - యమతర్పణం - యమధర్మరాజు ప్రశస్తి ఎంతో మహ త్తరమైంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే - కృష్ణచతుర్దశి నరక చతుర్దశి. ఆ రోజు యమ - దీపం వెలిగించడం, యమతర్పణం వద . లడం అనే ఆచారాన్ని మనవారు పాటిస్తారు. .

యమదీపాన్ని వెలిగించి, ప్రార్థనాశ్లోకం చదివి, రెండుచేతులను జోడించి యమధర్మరాజుకు భక్తితో

నమస్కరిస్తారు. నరకచతుర్దశినాడు యమదీపం, యమతర్పణం వలన. . . అపమృత్యు పరిహారం కాగలదు. అలాగే ఆ రోజు 'తైలాభ్యంగన

స్నానం చేసినవారు యమలోకం చూడరని ఆస్తికుల విశ్వాసం. : అని యమధర్మరాజు స్వరూపం

పుణ్యాత్ములనగా పుణ్యకర్మలు చేసేవారు. వారికి కొలదండధరుడైన యముడు శంఖ, చక్ర, గదాధారియై చిరుమందహాసంతో గరుడా రూఢుడై విష్ణుమూర్తివలె సౌమ్యరూపంతో దర్శనమిస్తున్నాడు. పాపాత్ములనగా పాపకర్మలు చేయువారు. వారికి కాలుడైన యముడు ఆయుధాలైన 'దండం, పాశం, కొడవలి, కత్తి ధరించి, ఎర్రని కన్ను లతో, పచ్చనిదేహం కలిగి, ఉగ్ర అనే దున్నపోతు పై కూర్చుని, కను . బొమ్మలు ముడివేసుకొని వున్నట్లుగా భయంకరంగా, వికార స్వరూ పంగా కనిపిస్తున్నాడు. పురాణకాలంలో యమునకు సంబంధించిన ఎన్నో గాథలున్నాయి. సూర్యభగవానునకు సంజ్ఞాదేవి వలన ముగ్గురు సంతానం జన్మించారు. వైవస్వతమనుడు, యముడు, యమున అనే ముగ్గురు. కనుక సూర్యుని కుమారుడు యముడు.

- సంయమి - రాజధాని - సంయమనగా లెస్సగా అన్నింటినీ మానివుండటం. అటువంటి సంయమి యముని రాజధాని. భూమం డలం చివర వున్న నగరం. అక్కడ రాజాం తఃపురంలో 'కాలాచి' అనే భవనంలో 'విచారభూ' అనే సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. చిత్రగుప్తుడు - మంత్రులు : చిత్రగుప్తుడు . కరణం. ప్రాణుల పాపపుణ్యాలను లెక్కలు - ' వ్రాయువాడు. చండుడు, మహాచండుడు అనే మంత్రుల సలహాలతో, ప్రజల పాప . పుణ్యాలను విచారిస్తున్నాడు. "

వామనం - దిగ్గజం : వామనమనగా అందమైన దేహం కలది. పొట్టిది. అటువంటి వామనమనే దిగ్గజం దక్షిణ దిక్కులో ఉన్నది. ఈ దిగ్గజం భార్య పేరు పింగళ (పింగళ వర్ణం కలది). యమకింకరులు : మృత్యువు, అపమృత్యువు మున్నగునవి యముని కింకరులు. వారు ప్రజలను నియంత్రించువారు. వారికి రాజు కాల దండధరుడు. కనుక 'యమరాట్' అని పేరు. యమదూతలు నల్లని వస్త్రాలను ధరిస్తారు. కాకి రూపంలో ఉంటారు. యముని సారథి రోగం.

వైరతిణీ నది': వితరణి అంటే సూర్యుడు లేనిది. పాతాళలోకం. అక్కడ పుట్టింది వైతరణి. నరకంలో ఉన్న నది. గో దానాదులచే - పితృదేవతలను దాటింపజేయుచున్నాం. .. కర్ణస్థానం - దక్షిణ దిగ్భాగం : పాంచభౌతికమైనదీ దేహం. ఇందులో కర్ణముల స్థానం, దక్షిణ దిగ్భాగంగా మంత్రద్రష్టలైన మహ ర్షులు దర్శించారు. అందువల్ల ఆ దిక్పాలకుడగు యమధర్మరాజుకు : నమస్కారం అని ఆగమవేత్తలు మహాన్యాసం, దశాంగరౌద్రీకరణం' నందు న్యాసం చేస్తున్నారు. యమశాసనం : యముడు చండశాసనుడు. ధర్మాధర్మాలను నిర్ణయం చేసేవాడు. విశ్వం సృష్టి, స్థితి, సంహారాలను అదుపులో పెట్టుకొన్న సత్త్వం యొక్క ఒక స్వరూపం యమశాసనం.

హరహర మహాదేవ శంభోశంకర

సర్వేజనా సుఖినోభవంతు

సమస్త సన్మంగళాని భవంతు 

హరి నామ స్మరణం 

సమస్త పాప హరణం

గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి

జై శ్రీరామ్ జై హనుమాన్ 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts