YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలంలో వైభవంగా శ్రావణమాసం శుక్రవారం పూజలు భారీగా తరలి వచ్చిన భక్తులు

శ్రీశైలంలో వైభవంగా శ్రావణమాసం శుక్రవారం పూజలు భారీగా తరలి వచ్చిన భక్తులు

శ్రీశైలంలో వైభవంగా శ్రావణమాసం శుక్రవారం పూజలు
భారీగా తరలి వచ్చిన భక్తులు
శ్రీశైలం
 శ్రావణమాసం శుక్రవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్ది పెరిగింది ఆలయంలో  సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ముత్తైదువ మహిళలు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వరలక్ష్మి వ్రతంలో  పాల్గొనే ముత్తైదువల కోసం వేరు వేరు కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరిపించుకొనే ముత్తైదువులకు అమ్మవారి శేషవస్త్రాలుగా రవిక పూలు, గాజులు ప్రసాదం దేవస్థానం ఉచ్చితంగా ఏర్పాటు చేసింది భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అయితె భక్తులలో సనాతన ధర్మంపై అవగాహనను కల్పించి, వారిలో ధార్మిక చింతనను పెంపొందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈఓ కెఎస్ రామారావు తెలిపారు  వైదిక సంప్రదాయంలో శ్రావణమాస వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తోందన్నారు. వరలక్ష్మి వ్రతం చేయడం వలన లక్ష్మీ కటాక్షం లభించి సకల శుభాలు, ఐశ్వర్యం లభిస్తాయని స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయని భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రావణమాస పూజలు ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకున్నారు

Related Posts