YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పవిత్రతకు ప్రతిరూపం రక్షాబంధన్ సోదర భావముతో సామాజిక ప్రగతి

పవిత్రతకు ప్రతిరూపం రక్షాబంధన్  సోదర భావముతో సామాజిక ప్రగతి

పవిత్ర బంధానికి ప్రతిరూపం. రక్షాబంధన్ అని జీవిఎంసి డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అన్నారు.. వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ ,  ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తముగా నిర్వహించిన రక్షా బంధన్ వేడుకల్లో డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సమాజంలో ప్రతి ఒక్కరూ మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ప్రపంచంలో సోదరబంధం అత్యంత పవిత్రమైందన్నారు. కళాఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీరమణమూర్తి, లక్ష్మిఆసుపత్రి అదినేత డాక్టర్ కె.రాంకుమార్ లు  మాట్లాడుతూ ప్రతీ ఏటా జర్నలిస్ట్ లు , బ్రహ్మ కుమారీస్ లు రక్షా బంధన్ వేడుకలు ఘనముగా జరుపుకోవడం అభినందనీయమన్నారు.. సమాజము లో సోదర భావం ను మించింది మరొకటి లేదన్నారు. జర్నలిస్టు లుకు .. తమ వంతు సహకారము అందిస్తామన్నారు.. బ్రహ్మ కుమారీస్ ప్రతినిథి రామేశ్వరి మాట్లాడుతూ పరమ శివుడు అసీస్సులు ప్రతీఒక్కరు పొందే విధముగా ముందుకు సాగాలన్నారు.. రక్షా బంధన్ అనేది పరమ పవిత్రమైన కార్యక్రమము అని , ఆధ్యాత్మిక భక్తి భావం కలుగుతుంది అన్నారు..ఇప్పటికే తన అవయవాలను దానం చేసానని తెలియజేస్తూ దీనిని ఒక ఉద్యమంగా చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. . ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా బ్రహ్మకుమారీల సమక్షంలో రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం విశాఖ  జర్నలిస్టుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. త్వరలో  రాజస్థాన్  మౌంట్ అబూలో జరిగే  అంతర్జాతీయ మీడియా శిక్షణ తరగతుల్లో ఈ సారి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొనాలన్నారు. కార్యదర్శి ఎస్, దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజుపట్నాయక్ లు మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం బ్రహ్మకుమారీలు చేపట్టే అన్ని కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులందరికీ రమ , రూప అక్కయ్య లు రాకీలు కట్టి మిఠాయిలు తినిపించారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు, ఫోరమ్ కార్యవర్గ సభ్యుడు గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.స్కూల్ ఆఫ్ దియేటర్ ఆర్ట్స్ బాల కళా కారులు ప్రదర్శనలు విశేషము గా అలరించాయి...

Related Posts