YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్
 ఖైరాతాబాద్ లో  నిర్వహిస్తున్న కోవిద్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.  ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య  శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ,  జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకులు సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జోనల్ కమీషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గోన్నారు.
సోమేశ్ కుమార్ మాట్లాడుతూ  ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా  సి.ఎం. కేసీఆర్  ఆదేశాల ప్రకారం పలు కార్యక్రమాలను చేపట్టాం.   ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి.   ఇళ్లలో ఇంకా మిగిలిన వారికే   ఈ ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరం లో చేపట్టాం. గ్రేటర్ లో మొత్తం 4846 కాలనీలు, బస్తీల్లో మొబైల్ వ్యాక్సినేషన్   కేంద్రాలు ఏర్పాటు చేసి 18 ఏళ్ల పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు.
ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భాగస్వామ్యులు కావాలని మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులనందరికి విజ్ఞప్తి చేసాం.   హైదారాబాద్ లాంటి మహా నగరంలో 100 శాతం అర్హులైన వారికి వాక్సినేషన్ పూర్తి చేసే ఈ అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం, ఇప్పటి వరకు దేశంలోని మారె పెద్ద నగరాల్లో నిర్వహించేంచలేదు.   హైదరాబాద్, కంటోన్మెంట్ లలో నేడు 175 మొబైల్ వాహనాల ద్వారా వాక్సినేషన్ నడుస్తోంది.   ప్రతి ఇంటికి జీహెచ్ఎంసీ, ఆశ సిబ్బంది తిరిగి ఇళ్లలో వాక్సిన్ తీసుకొని వారి జాబితాను సేకరించి వారికి ఈ ప్రత్యేక డ్రైవ్ లో వాక్సిన్ ఇస్తున్నాం.   ఇంటిలో అందరికి వాక్సినేషన్ పూర్తయితే ఆ ఇంటికి  "ఈ ఇంటిలో అందరికి వాక్సిన్ పూర్తయింది" అనే స్టిక్కర్ అతికిస్తున్నాం.   మొత్తం కాలనీ లేదా బస్తీలో 100 వాక్సిన్ పూర్తయితే ఆయా కాలనీలకు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని జీహెచ్ ఎంసీ కమీషనర్ అందచేస్తారు.  ఈ వాక్సినేషన్ కార్య్రక్రమాన్ని నేను ప్రతి రోజూ తనిఖీ చేస్తాను.   రాష్ట్రంలో కరోనా  థర్డ్ వేవ్ రాదనే భావిస్తున్నామని అన్నారు.
 అయినప్పటికీ, ఏ విధమైన సంఘటనలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ప్రస్తుతం 27,000 బెడ్ లు సిద్ధంగా ఉన్నాయి.  ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్  కాలేజ్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  కృత నిశ్చయంతో ఉన్నారు.  ఎనిమిది మెడికల్ కళాశాలల్లో పడకల సంఖ్యను పెంచుతున్నామని అన్నారు.

Related Posts