YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో స్వల్పంగా తగ్గిన  కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన  కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన  కరోనా కేసులు
న్యూఢిల్లీ ఆగష్టు 23
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 32 వేల కేసులు నమోదవగా, తాజాగా 25 వేలకు తగ్గాయి. ఇది నిన్నటి కంటే 19 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా గతేడాది మార్చి తర్వాత యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఇప్పటివరకు 58.25 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక మొత్తం కేసుల్లో 3,33,924 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 44,157 మంది కోలుకోగా, 389 మంది కన్నుమూశారు. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.2 శాతంగా ఉందని, 2020, మార్చి తర్వాత కరోనాతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు గత 28 రోజులుగా 3 శాతం కంటే తక్కువగానే ఉంటున్నదని వెల్లడించింది. రికవరీ రేటు 97.63 శాతానికి చేరిందని పేర్కొన్నది.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 7,95,543 మందికి టీకా ఇచ్చామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం 58,25,49,595 డోసులను పంపిణీ చేశామని తెలిపింది. అదేవిధంగా ఆగస్టు 22న 12,95,160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది. దీంతో ఆదివారం వరకు మొత్తం 50,75,51,399 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

Related Posts