YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

10 వారాలు... 10 గంటలకు 10 నిమిషాలు

10 వారాలు... 10 గంటలకు 10 నిమిషాలు

హైదరాబాద్, ఆగస్టు 24, 
తెలంగాణ రాష్ట్రాన్ని సీజనల్ విష జ్వరాలు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయి. విష జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రుల ముందు జనాల క్యూ కడుతున్నారు. కరోనా వేళ ఏ జ్వరం దేనిదో అర్ధంకాక జనాల్లో భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1206కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే 510కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 220 మలేరియా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత ములుగు జిల్లాలో 129 మలేరియా కేసులు నమోదయ్యాయి.డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీలోనే నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 447 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికం. ఇక రంగారెడ్డి జిల్లాలో 115, మేడ్చల్ జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. అటు ఖమ్మం జిల్లాలో 128 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దోమల లార్వా డెన్సిటీ హైదరాబాద్ లో 46 శాతం, వనపర్తిలో 46 ఉండగా ఎక్కువ ప్రాంతాల్లో 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపారు. అన్ని జ్వరాలను ప్రజలు కోవిడ్ జ్వరాలుగా భావించి మందులు వాడొద్దన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ సూచించింది. నగర ప్రాంతాల్లో  డెంగ్యూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రాంతాల్లో దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్, బ్లీచింగ్, ఫాగింగ్ తదితర చర్యలు చేపడుతోంది. నేటి నుంచి ‘ఆదివారం 10 గంటలకు పది నిమిషాల’ కార్యక్రమం చేపట్టనుంది జిహెచ్ఎంసీ. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పది గంటలకు 10 నిమిషాలు కార్యక్రమం నిర్వహించనున్నారు. పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు క్లినింగ్ ప్రోగ్రాం చేపట్టాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. దోమలు చేరకుండా తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే దోమలు చేరే అవకాశముంటుంది.

Related Posts