YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
తిరుపతి
ఏ సమాజంలో అయినా దేశమేదైనా మహిళా శక్తి సమాజ శక్తిగా మారి దేశాభివృద్ధికి బలమైన శక్తి గా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 18 వ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలపు సురేష్‌ ప్రసంగించారు. వర్సిటీ ఛాన్సలర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ... యువశక్తికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా కమ్యూనికేషన్‌ స్కిల్క్స్‌ను పెంపొందించడం ద్వారా దేశాన్ని బలమైన శక్తిగా రూపొందించవచ్చు అని పేర్కొన్నారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.

Related Posts