YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అంగరంగ వైభవంగా రాఘవేంద్రుల మహారథోత్సవం బృందావనానికి విశేష పూజలు

అంగరంగ వైభవంగా రాఘవేంద్రుల మహారథోత్సవం బృందావనానికి విశేష పూజలు

అంగరంగ వైభవంగా రాఘవేంద్రుల మహారథోత్సవం
బృందావనానికి విశేష పూజలు
మహారథోత్సవంపై  ఊరేగిన ప్రహ్లాద రాయలు
ఆకట్టుకున్న విశేషా వేషాదారులు
మంత్రాలయం
 కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే కల్పతరువు అయిన కలియుగ రాఘవేంద్రస్వామి 350 వ. సప్తరాత్సోవాలలో భాగంగా ఉత్తర ఆరాధన రోజైనా మహారథోత్సవం బుధవారం పీఠాధిపతుల ఆధ్వర్యంలో అశేష భక్తజన వాహినికి మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మఠంలో విశేషమైన పూజలు సేవా కర్తల సేవలు భజన మండలి భక్తి పాటలు కళాకారుల వైవిధ్యమైన వేషధారణ సాంస్కృతిక కార్యక్రమాలు , ప్రముఖుల సందర్శనాలతో  రాఘవేంద్రుల  సప్త రాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రోజున మహారథోత్సవాన్ని తిలకించడానికి  స్థానిక ప్రజలు,చుట్టు పక్కల గ్రామాల  భక్తులే కాక ఆంధ్ర కర్ణాటక తమిళనాడు భక్తులు మంత్రాలయం చేరుకొని గ్రామదేవత మంచాలమ్మ,  రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని మహా రథోత్సవాన్ని తిలకించి  పునీతులయ్యారు.
 బృందావనానికి విశేష పూజలు  
   సప్త రాత్రోత్సవాలలో భాగంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిర్మాల్య  విసర్జనం పంచామృత అభిషేకము స్వర్ణ కవచ సమర్పణ విశేష అలంకార సంతర్పణం  విశేష పుష్పాలంకరణ గావించి  పీఠాధిపతులు మహా మంగళారతులు సమర్పించారు. గర్భగుడిలో పూజ మందిరంలో జయ దిగ్విజయ మూల రాముల పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రఘుపతి వేద వ్యాసదేవర పూజ , పాదపూజ  అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను  దర్శించుకున్న భక్తులు  పాద పూజ కార్యక్రమాన్ని కూడా కనులారా గాంచి  పునీతులయ్యారు. ఉత్సవ మూర్తి  ప్రహ్లాద రాయలకు ప్రత్యేక పూజల అనంతరం గర్భ గుడి నుండి మంగళవాయిద్యాలతో మేళతాళాలతో శ్రీ మఠం మాడవీధుల్లో కి ఊరేగింపుగా తీసుకువచ్చారు. 
కన్నుల పండుగ రా వసంతోత్సవం
 పీఠాధిపతులు విశేష పూజలు అనంతరం భక్తులపై రంగులు చెల్లి వసంతోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రముఖులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవంలో పాల్గొన్నారు . ప్రహ్లాద రాయల ఊరేగింపు ముందు అశ్వ ప్రదర్శన భక్తులను  సంబర పరిచింది. ఊరేగింపుగా ప్రహ్లాద రాయల ఉత్సవమూర్తి బహు సుందరంగా అలంకరించిన రథోత్సవం పైకి చేర్చారు. అనంతరం పీఠాధిపతులు భక్తులకు  భక్తి ప్రవచనాలను భక్తులకు బోధించారు. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం మహా రథోత్సవం మేళతాళాల మధ్య మంగళ వాయిద్యాలతో అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా ముందుకు కదిలింది.
ఈ మఠంలో ప్రముఖుల సందర్శన
 రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను  దర్శించుకోవడానికి పలువురు ప్రముఖులు మంత్రాలయంకు వచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మంత్రాలయంకు వచ్చి మూల  బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  స్థానిక ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైకాపా సీనియర్ సీతారామిరెడ్డి మంత్రాలయంకు వచ్చి దర్శించుకున్నారు. రాఘవేంద్ర స్వామి  మహా రథోత్సవం రోజున  వైకాపా రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి వైకాపా మండల ఇన్చార్జి విశ్వనాధ రెడ్డి మూల బృందావనాన్ని దర్శించుకుని మహారథోత్సవంలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కా రెడ్డి కూడా మహారథోత్సవం రోజున రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

Related Posts