YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నకిలీ డాక్టర్ అరెస్ట్

నకిలీ డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్
ఉస్మానియా ఆసుపత్రి లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్న నిందితుని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేసారు. పాతబస్తీ బండ్లగూడ కు చెందిన ' మర్వాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అలీ ' చదివింది ఇంటర్ బైపీసీ. వైద్య వృత్తి చేయాలంటే ఏంబీబీఎస్ సర్టిఫికెట్ తప్పనిసరి అని గ్రహించిన అలీ ఉస్మానియా ఆసుపత్రి లో డాక్టర్ కోట్ వేసుకొని మేడలో స్కోతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి లో అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో సమానంగా కూర్చున్నాడు. కొద్దీ సేపటి తర్వాత క్యాజువాలిటీ సీఎంఓ కు అనుమానం వచ్చి అతని ప్రవర్తన పై ఆరా తీసారు. పొంతన లేని సమాధానాలు చెపుతుండడంతో  నకిలీ వైద్యుడు గా చలామణి అవుతున్నాడు అని గుర్తించిచారు. వెంటనే స్థానిక అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.  పోలీసుల  విచారణలో అలీ నకిలీ వైద్యుడు అని తేలడం తో నిందితుని పైన 170,420,419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

Related Posts