YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రభుత్వ స్కూల్లో మందు, వ్యభిచారం

ప్రభుత్వ స్కూల్లో మందు, వ్యభిచారం

యాదాద్రి
యాదాద్రి పుణ్యక్షేత్రం వద్ద ఆకతాయిలు రెచ్చిపోయారు. బడి, గుడి అనే తేడా లేకుండా.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ పాఠశాలనే బార్లు, లాడ్జ్ లు గా మార్చేసి.. పాడు పనులకు తెగబడ్డారు. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా ఆకతాయిల నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యం రెండూ బయట పడ్డాయి. కొద్దిరోజుల్లో తెరుచుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాల కథ ఇది. ఇన్నాళ్లు కరోనా కారణంగా స్కూల్స్ క్లోస్ కావడంతో   ఈ గదులు మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా స్కూల్స్ లో మందు కొట్టడం.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం ఇక్కడ కామన్ అయిపోయింది. సెప్టెంబర్ 1 వ తేదీన స్కూల్స్ రీఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, ఆకతాయిలు, మందుబాబుల బాగోతం బట్ట బయట పడింది. ప్రభుత్వ పాఠశాల గదుల్లో ఎక్కడ చూసినా మందు బాటిళ్లు, సిగరెట్ ప్యాకేట్స్, కండోమ్ ప్యాకేట్స్ బయట పడ్డాయి. కాగా.. కొద్దిరోజులుగా యాదాద్రి పుణ్యక్షేత్రం వద్ద గల లాడ్జ్ లపై పోలీసులు నిఘా పెంచడంతో, కొందరు నీచులు ప్రభుత్వ పాఠశాలను సేఫ్ జోన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.  పాఠశాలలో పాడు పనులకు పాల్పడ్డవారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Related Posts