YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అనధికార మధ్య విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన సెబ్ పోలీసులు

అనధికార మధ్య విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన సెబ్ పోలీసులు

నెల్లూరు 
అనధికార మద్యం విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో నెల్లూరు -2 స్టేషన్ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో మాతంగి సురేష్ అనే వ్యక్తి వద్ద అనధికార 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందు బాటిల్ తో పాటు ఎక్సైజ్ మెజిస్ట్రేట్ ముందు ముద్దాయిలను కూడా హాజరు పరచడమైనదని తెలిపారు . వీరితో పాటు పాత కేసులో ముద్దాయిగా ఉన్న అల్లం పాటి ఫణీంద్ర ను కూడా అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధిత , అనధికార మెటీరియల్స్ ను అమ్మకాలు జరుపుతున్నట్లు వస్తున్న సమాచారంపై వెంటనే స్పందించినందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఎప్పుడు  సిద్ధంగానే ఉంటాయన్నారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటుకై ప్రతి ఒక్కరూ అనధికార , నిషేధిత మెటీరియల్స్ అమ్మకాలు తదితర లావాదేవీలపై వెంటనే సమాచారం అందిస్తే , వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు సమాజసేవకులు గా గుర్తిస్తామని పేర్కొన్నారు.

Related Posts