YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పరమాత్ముడు వెలసిన క్షేత్రం అనంత పద్మనాభుడు.

పరమాత్ముడు వెలసిన క్షేత్రం అనంత పద్మనాభుడు.

సరిపోకుండే వీడుకులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభక్షేత్రం. మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఒకటి. కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్న ఈ దివ్యాలయం దేశంలో అత్యంత ఎక్కువ సంపదలున్న ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదిగా ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్ భాగవతం తెలుపుతోంది.

స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ద్వాపరయుగంలో ఈ ఆలయాన్ని ఫాల్గుణం అని పిలిచేవారు. ఆ కాలంలో బలరాముడు ఈ దేవాలయాన్ని దర్శించి, ఇక్కడున్న పద్మ తీర్ధంలో స్నానం చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయ వైశిష్ట్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాత నమైనది. ఈ ఆలయం పేరు మీదే తిరువనంత పురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీటల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుం బాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టు కున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. 'తిరు అనంత పురం' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయమని అర్థం. ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడం వల్లనే ఈ నగరానికి తిరువనంతపురమనే పేరు వచ్చింది. అనంతపురం, శయనంతపురం అనే పేర్లతో కూడా ఈ నగరాన్ని పిలుస్తారు.

తొలినాళ్లలో ఆలయాన్ని విస్తరించేందుకు రాజా మార్తాండవర్మ ఇతోధికంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపం, భద్రదీపం అనే పూజా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అనంతరం వారి వంశంలో వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా వుండి అనంతమైన సంపదను పరిరక్షించారు. ఆలయంలోని కుడ్యకళ ఆకట్టుకుంటుంది. కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆల్వార్ ప్రబంధ గ్రంధాలలో వుంది. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆళ్వార్ కవి 'నమ్మాళ్వార్ పద్మనాభ స్వామి దేవాలయం గురించి పొగడుతూ, నాలుగు శ్లోకాలను, ఒక ఫల శృతిని తన రచనలలో పొందుపరిచారు. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల ఏడంతస్తుల గోపురం పునాదులు 1566లోనే పడ్డాయి. 'పద్మ తీర్థం' అనే విశాలమైన పుష్కరిణి ఉంది. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది. తూర్పు దిక్కుగా వున్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగానున్న మొదటి అంతస్తును 'నాటక శాల' అని పిలుస్తారు. ఈ ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో నిక్షిప్తం చేశారు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా వాటిని తెరచి చూడలేదు. స్వాతంత్యా నంతరం స్థానిక ఆలయాలన్నింటిని ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరధామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాల కొద్దీ బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు, గొలుసులు బయల్ప డ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపారే కాలం నాటివి బస్తాల్లో లభించాయి. బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది. మూలవిరాట్టును మూడు ద్వారాల్లో నుంచి దర్శించాలి. స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడంతో తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో 1208 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ  రోజుల్లో 4వేల శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, నూరు ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలోని పలు కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. . ఆది శేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో అంటే అనంతశేషుడి తల్పం మీద యోగనిద్రలో దర్శనమిస్తాడు. స్వామి తూర్పు ముఖంగా , భుజంగశయనంగా దర్శనమిస్తాడు. - ఇక్కడ అమ్మవారు శ్రీహరి లక్ష్మీ తాయారుగా నీరాజనాలందుకుంటోంది. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. 

Related Posts