YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

కాణిపాకంలో జన్మాష్టమి వేడుకలు  

కాణిపాకంలో జన్మాష్టమి వేడుకలు  

 

కాణిపాకంలో జన్మాష్టమి వేడుకలు  
చిత్తూరు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ గోశాల  నందు సోమవారం  శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు  వైభవంగ    జరిగాయి.  ఆలయ ఉద్యోగులు, సిబ్బంది ఉభయ దారులు   వేదపండితులు అర్చకులు అద్వర్యంలో నిర్వహించిన ఈ  పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ  శ్రీ కృష్ణునికి ఇష్టమైన  గోమాత పూజచేయడం అన్ని విధాలుగా మంచి జరుగుతుందని తెలిపారు. గోవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని గోవులను  దైవంగా భావించి పూజలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోసాల నందు గోవులకు ఉచితంగా దాణా సరఫరా చేసే ఉభయ దారులకు దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, ఏసీ కస్తూరి , టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ , ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,.

Related Posts