YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్

కాకినాడ
టీవీ9 క్రైమ్ రిపోర్టర్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అన్నవరం పోలీసులు అరెస్టు చేసారు. శంఖవరం మండలం లో ఎస్వివిడీ  డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టీవీ9 క్రైమ్ జర్నలిస్ట్ గా చెప్పు కుంటూ పలువురిని బెదిరించి  డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. నకిలీ విలేకరి మండపేట కు చెందినవాడు. అన్నవరం కొండ పై ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసాడు. యువకుడు ఫిర్యాదుతో నకిలీ విలేకరి బాగోతం వెలుగులోకి వచ్చింది.

Related Posts