YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వైరస్ కంట్రోల్ లో ఉంది...

వైరస్ కంట్రోల్ లో ఉంది...

వైరస్ కంట్రోల్ లో ఉంది...
హైదరాబాద్, సెప్టెంబర్ 1,
పాఠశాలల్లో ఎక్కువ మంది ఒకేసారి వైరస్  బారిన పడితే ఆ పాఠశాలని క్లష్టర్‌గా గుర్తించి పిల్లలకు, టీచర్స్ కి వెంటనే టెస్టులు చేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. టెస్టుల్లో ఐదుగురు కంటే ఎక్కువ మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే పాఠశాల స్ట్రెంత్‌ని బట్టి వారం రోజుల పాటు స్కూల్‌ని మూసివేస్తామని చెప్పారు. ఒకే క్లాస్‌లో ఎక్కువ కేసులు నమోదైతే.. ఆ క్లాస్‌లోని స్టూడెంట్స్ అందరినీ ఐసోలేషన్‌కి పంపుతామని వెల్లడించారు. 95% పాఠశాలల స్టాఫ్‌కి వాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మాత్రమే టీచర్లను, స్టాఫ్‌ని పాఠశాలల్లోని అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపారు. పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. పిల్లల మానసిక స్థితి దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు తెరిచామన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను స్కూల్‌కు పంపాలని కోరారు.
ఇక జీహెచ్‌ఎంసీలో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు. 175 వాహనాల ద్వారా జీహెచ్‌ఎంసీలో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.  60% కాలనీలలో 100% వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.  మొబైల్ వాక్సినేషన్ ద్వారా 5.16 లక్షల మందికి వాక్సిన్ అందిచినట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీలో పూర్తయిన అనంతరం ఇతర కార్పొరేషన్‌లు, గ్రామీణ ప్రాంతాలకు వాక్సినేషన్ డ్రైవ్ ని అందుబాటులోకి తెస్తామని శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో వాక్సినేషన్ కంప్లీట్ అయితేనే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, ఇతర పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. తెలంగాణలో వైరస్ పూర్తిగా కంట్రోల్‌లో ఉందని.. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. గతంలో కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి కంట్రోల్‌లోకి వచ్చిందని చెప్పారు. అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ చేశామని, థర్మల్ స్క్రీనింగ్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు.1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మంది కరోనా బారిన పడ్డారని.. 20 ఏళ్లల్లోపు వారిలో 13 శాతం మందికి కొవిడ్ సోకిందని తెలిపారు. పిల్లలకు కరోనా సోకినా 100 శాతం కోలుకుంటున్నారని డీహెచ్‌ శ్రీనివాస రావు చెప్పారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడయిందని తెలిపారు. బోనాలు వంటి వేడుకలు జరిగినా కేసులు పెరగలేదని గుర్తు చేశారు.

Related Posts