YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వ‌రకు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌యం 

సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వ‌రకు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌యం 

సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వ‌రకు
శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బాలాల‌యం 
తిరుపతి, మా ప్రతినిధి ,సెప్టెంబర్ 01,  
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 9 నుండి 13వ తేదీ వరకు ''బాలాలయం'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఆల‌య విమాన గోపురానికి రాగి రేకుల‌పై బంగారు తాప‌డం ప‌నులు చేప‌ట్టేందుకు ముందు ఈ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. ఇందుకోసం సెప్టెంబ‌రు 8న ఉద‌యం 10.30 గంటలకు ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం, సాయంత్రం 6.30 గంటల నుండి మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, వాస్తు హోమం, అంకురార్పణ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.
  ఈ ప‌నుల కోసం ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేస్తారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆల‌య విమాన గోపురానికి బంగారు తాప‌డం ప‌నులు సెప్టెంబ‌రు 14 నుండి 2022 మే నెల వ‌ర‌కు జ‌రుగుతాయి. అప్ప‌టి వ‌ర‌కు భ‌క్తుల‌కు య‌ధావిధిగా మూల‌మూర్తి ద‌ర్శ‌నం ఉంటుంది.

Related Posts