YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*మహాలక్ష్మి ధ్యాన శ్లోకం*

*మహాలక్ష్మి ధ్యాన శ్లోకం*

*పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం* 

 *పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామ హర్నిశమ్* 

 *పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం* 

 *వరదాభయ హస్తాడ్యాం ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్* 

 *ఇచ్చా రూపాం భగవత స్సచ్చిదానంద రూపిణీం* 

 *సర్వజ్ఞాం సర్వజననీ, విష్ణువక్ష స్త్ఫాలాలయామ్*      

 *దయాళుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్*

పద్మముల వంటి నేత్రములు కలిగినది; పద్మనాభునికి ప్రియమైనది; పద్మమునందు కూర్చున్నది; పద్మమువలె వికసించినటువంటి సుందర వదనం కలిగినది; 

పద్మహస్తాం - పద్మముల వంటి చేతులు కలిగినది; జ్ఞానాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికై పైనున్న రెండు చేతులలో రెండు పద్మములు పట్టుకొని ఉన్నది; కోరినవన్నీ ఇస్తాను అని చెప్పడానికై క్రింది రెండు చేతులతో వరదముద్ర,  జ్ఞానాన్ని, అభయాన్ని ఇస్తాను అని చెప్పడానికై అభయముద్రలతో ఉన్నది;  పద్మము అంటేనే ఐశ్వర్యము, జ్ఞానము, ఆనందము. లౌకిక సుఖములు ఇస్తాను చెప్పడానికి వరద హస్తము, అలౌకికమైన జ్ఞానము, మోక్షము ఇస్తాను చెప్పడానికి అభయ హస్తము. అభయ వరద ముద్రలతోను, రెండు పద్మముల తోనూ ఉన్న నాలుగు చేతులతో ఉన్న తల్లి, 

పూర్ణేందు బింబవదనాం - నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది,

రత్నాభరణభూషితాం - శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణములను అలంకరించుకున్నది, 

చంద్ర సహోదరీం - క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు చంద్రునితో పాటు పుట్టింది. చంద్ర సహోదరీం అనే మాటలో విశేషం ఏమిటంటే చంద్రునికి ఉన్నటువంటి ఆహ్లాద లక్షణము, ప్రసన్నతా లక్షణము అమ్మవారి వద్ద ఉన్నది అని చెప్పడం. మరొక ప్రత్యేకత సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబ స్వరూపిణి అని చెప్పడం. 

ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానంద రూపిణీం – భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛా శక్తి స్వరూపిణి. సచ్చిదానంద రూపిణి అయిన తల్లి.

సర్వజ్ఞాం – అన్నీ తెలిసిన తల్లి; 

సర్వ జననీం – సర్వ జగత్తుకూ తల్లి;  

విష్ణు వక్షస్థలాలయామ్ – నారాయణుని వక్ష స్థలంలో ఉన్నది, 

దయాళుః – దయ గలిగిన తల్లి; 

అనిశం ధ్యాయేత్ – ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను. 

సుఖ సిద్ధి స్వరూపిణీం – ఆనందము, సిద్ధి(కార్య సిద్ధి, మోక్షము) ఈ రెండింటి యొక్క రూపమే మహాలక్ష్మి.

Related Posts