YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆచార్య దేవోభవ!

ఆచార్య దేవోభవ!

ఆచార్య దేవోభవ!

బిడ్డకు తొలి దైవం అమ్మ. లోకానికి శిశువును, శిశువుకు లోకాన్ని పరిచయం చేసేది ఆమే. కాబట్టి తల్లి తొలి గురువు. 

ఆ బిడ్డకు నడత నేర్పే నాన్న మలి గురువు. ఆ తరవాతి స్థానం గురువుది. 

లోకంలో ఎలా మెలగాలో చెబుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అందుకే పెద్దలు మాతృదేవో భవ... పితృదేవో భవ... ఆచార్య దేవోభవ అన్నారు.విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది. కాబట్టి విద్య మానవత్వానికి మారుపేరు కావాలి. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు నేర్పించేదై ఉండాలి. సామాజికాభివృద్ధికి దోహద పడాలి. ఈ ప్రక్రియలన్నింటికీ వెన్నంటి ఉండేవాడే ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయులు, గురువులు సనాతన భారతావనిలో ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందినవారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌.గురువు- మనసును ఆవరించుకుని ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగిస్తాడు. దైవం మంచి గురువును చూపలేక పోవచ్చేమో, కానీ మంచి గురువైతే మాత్రం దేవుణ్ని సైతం చూపగలడంటారు పెద్దలు. ‘దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను’ అన్నారు కబీర్‌ దాసు. అంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పినవారు డాక్టర్‌ రాధాకృష్ణన్‌.రాధాకృష్ణన్‌ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం వెనక ఒక కథ ఉంది. రాధాకృష్ణన్‌ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, మిత్రులు సెప్టెంబర్‌ అయిదున ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడానికి సన్నద్ధులయ్యారు. అనుమతించమని ఆయనను కోరారు. దానికి ఆయన నవ్వుతూ ‘నా పుట్టిన రోజున ఈ రకమైన వేడుకలకు బదులు, ఉపాధ్యాయులను గౌరవించే దినోత్సవంగా జరిపితే బాగుంటుందేమో’ అని సూచించారట. అప్పటి నుంచి ఏటా రాధాకృష్ణన్‌ జన్మదినమైన సెప్టెంబర్‌ అయిదో తేదీన ఉపాధ్యాయ దినంగా దేశమంతా జరుపుకొంటోంది. వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాతృభాష తెలుగు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్‌ అయ్యారు. రాధాకృష్ణన్‌ చెప్పే పాఠాలు, ప్రసంగాలు, ఆయన వ్యక్తిత్వం విద్యార్థులను ఉత్తేజపరచేవి. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను విన్న మైసూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి హెచ్‌.వి. నంజుండయ్య పిలిపించి ఆచార్య పదవిలో నియమించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని డాక్టర్‌ ఆశుతోష్‌ ముఖర్జీ, రవీంద్రనాథ్‌ టాగోర్‌ కోరడంతో- ఆయన అక్కడికి వెళ్ళారు. కలకత్తా కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరేందుకు రాధాకృష్ణన్‌ బయలుదేరినప్పుడు మైసూరు విద్యార్థులు పువ్వులతో అలంకరించిన ఒక గుర్రపు బగ్గీని ఏర్పాటు చేశారు. ఆ గుర్రపు బగ్గీని శిష్యులందరూ లాక్కుంటూ రైల్వేస్టేషన్‌ వరకు తీసుకువెళ్ళి వీడ్కోలు పలికారట!కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు ఆయన ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. సంస్కృతి, మతం, వేదాంతం, తత్త్వశాస్త్రం తదితర అంశాలపై ఇరవై మూడు గ్రంథాలు రచించారు. ఆయన తాత్విక చింతనకు సాహిత్య మాధుర్యాన్ని చేకూర్చిన మహా రచయిత. సనాతన భారతీయ పారమార్థిక విషయాలను ప్రపంచానికి సులభంగా, సుస్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు రాధాకృష్ణన్‌. ????????????

 

????????????????????????????????????????

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయరామ జయ జయరామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

Related Posts