YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

"అనంతమైన  ఆనందాన్ని  మనకు ప్రసాదించే మార్గమే ధ్యానం.*

"అనంతమైన  ఆనందాన్ని  మనకు ప్రసాదించే మార్గమే ధ్యానం.*

"ఆనందానికి  మార్గం"

"అనంతమైన  ఆనందాన్ని  మనకు ప్రసాదించే మార్గమే ధ్యానం.*

*ప్రార్థనలు, కర్మకలాపాలూ ఇతర  విధాలైన  పూజలు  ఇవన్నీ  ధ్యానంలో  ఒకటవ తరగతి లాంటివి మాత్రమే!"*

*"ప్రార్థనచేస్తూ  ఏదో ఒకటి నివేదన చేస్తావు. దానివల్ల  మనలోని  ఆధ్యాత్మికత జాగృతమౌతుంది. ఒక సిద్ధాంతం ప్రకారం  అన్నీ మనలోని  ఆధ్యాత్మిక శక్తిని  జాగృతం చేసేవే."*

  *"కొన్నికొన్ని  శబ్దాలను  ఉచ్చరించటంతో  మొదలుకొని,పుష్పాలు,ప్రతిమలు, దేవాలయాలు, హారతి ‌ఇవ్వటానికి ఉపయోగించే దీపారాధనలు, ఇత్యాదులన్నీ‌ ఆధ్యాత్మిక  దృక్పధానికి  మనస్సును చేరుస్తాయి."*

    *"అయితే ఆ దృక్పధం‌  మరెక్కడో  లేదు. అది మానవుని  ఆత్మలోనే  ఉంది. మనుష్యులంతా  ఇది చేస్తూనే ఉన్నారు. కానీ వారు తమకు  తెలియకుండా ‌ఏది చేస్తున్నారో,  దానినే  ధ్యానంలో  తెలిసి  చేస్తారు.*

    *అదే  ధ్యానం యొక్క శక్తి."*

   *"నెమ్మది నెమ్మదిగా , క్రమక్రమంగా మనల్ని మనం  తీర్చిదిద్దుకోవాలి. ఇదేదో చమత్కారం కాదు. ఒక రోజుతో అయ్యేపనీ  కాదు."*

     *"కొన్ని  జన్మలు పట్టవచ్చు. అయినా  ఫర్వాలేదు.దాన్ని కొనసాగించవలసిందే. మనమేమి  చేస్తున్నామన్న దానిమీద  పూర్తి అవగాహనతో , పూర్తి స్ప్రుహతో, స్వచ్ఛందంగా  ఈ ధ్యాన సాధన కొనసాగించాలి."*

    *"ప్రత్యక్షంగా  అనుభూతి చెందటం ప్రారంభించి  నిజమైన  పారమార్థిక  నిధులను  పొందగలుగుతాం. వాటిని  మనకు  ఎవరూ దూరం చేయలేరు. ఆ సంపదను ఎవరూ  నాశనం చేయలేరు."*          

*"అంతేకాదు ఆ ఆనందాన్ని  ఏ విషాదమూ  ఎన్నడూ కప్పివేయలేదు."* 

Related Posts