YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్టాలిన్ 10 ఏళ్ల పాటు పదిలమే

స్టాలిన్ 10 ఏళ్ల పాటు పదిలమే

చెన్నై, సెప్టెంబర్ 6, 
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన పదవిని పదేళ్లపాటు పదిలంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరి మన్ననలను పొందే ప్రయత్నం చేస్తున్నారు. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన నెలల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. తన తండ్రి కరుణానిధి పాలనకు భిన్నంగా చేయాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. తాను ముఖ్యమంత్రిగా పదేళ్లు పాటు ఉండాలన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తుంది.స్టాలిన్ గత ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అపూర్వ విజయాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని పది కాలాల పాటు నిలుపుకోవాలన్నది స్టాలిన్ ఆలోచనగా ఉంది. అందుకోసమే స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు విపక్షాలు సయితం ప్రశంసించేలా నిర్ణయాలు ఉండాలని స్టాలిన్ తన పాలనను కొనసాగిస్తున్నారు. విపక్షాలకు సయితం స్టాలిన్ వైఖరి మింగుడు పడలేదు.నిజానికి స్టాలిన్ కు ఇప్పుడు ఎదురు లేదు. విపక్షాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. సరైన నాయకత్వం లేక అన్నాడీఎంకే ఆపసోపాలు పడుతుంది. వచ్చే ఎన్నికల సమయానికి కూడా విపక్షాలను అదే స్థానంలో ఉంచాలన్నది స్టాలిన్ భావన. అందుకోసమే ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అని పార్టీ నేతలు కూడా అంటున్నారు. జయలలిత బొమ్మ ఉన్న స్కూల్ బ్యాగ్ లను స్టాక్ అయ్యేంత వరకూ పిల్లలకు పంపిణీ చేయాలని స్టాలిన్ నిర్ణయించారు.అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ప్రొఫెషనల్స్ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించడం కూడా అందరి ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ప్రభుత్వ యూనివర్సిటీల్లో అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెరగనుంది. ఈ నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటోంది. మొత్తం మీద పదేళ్ల పాటు అధికారంలో ఉండాలన్న స్టాలిన్ ప్రయత్నాలు విపక్షాలను సయితం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

Related Posts