YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాహుల్... బ్యాక్ స్టెప్

రాహుల్... బ్యాక్ స్టెప్

అదిలాబాద్, సెప్టెంబర్ 6,
తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది.ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను ధూంధాం గా నిర్వహించి సత్తా చాటాలని.. రాహుల్ గాంధీని పిలిపించి రచ్చ చేయాలని భావించింది. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. రాహుల్ రావడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా గాంధీ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.కాకుంటే.. వారు చెబుతున్న కారణం మాత్రం మరోలా ఉంది లెండి. దేశ రాజకీయాల దృష్ట్యా రాహుల్ గాంధీ చాలా బిజీగా ఉన్నారని.. ఇప్పట్లో ఆయన వరంగల్ కు వచ్చే అవకాశాలు లేవని.. కాబట్టి 17న అక్కడ దళిత గిరిజన దండోరా ముగింపు సభ పెట్టినా.. రాహుల్ లేకుండానే నిర్వహించుకోవాలని.. రేవంత్ అండ్ బ్యాచ్ కు సంకేతాలు అందాయట. ఇది.. పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తిని కలిగించిందన్నది వాస్తవం.ఇది తెలుసుకున్న రేవంత్ టీమ్.. ప్లాన్ చేసింది. రూట్ మార్చింది. 8న గజ్వేల్ లో సభ నిర్వహించాలంటే సమయం సరిపోదు కాబట్టి.. ఆ నిర్ణయాన్ని మార్చి.. నేరుగా 17నే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే సభ నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చారట. ఈ సభకు సమయం కూడా సరిపోతుందని భావిస్తున్నారట. రాహుల్ రావడం లేదు కాబట్టి.. మరో ముఖ్యనేతను ఆహ్వానించాలని నిర్ణయించారట.లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బలమైన గళం వినిపిస్తున్న మల్లికార్జున ఖర్గేను.. రాహుల్ బదులుగా ఈ సభకు ఆహ్వానించి.. తమ పోరాటాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని రేవంత్ టీమ్ కసరత్తు చేస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఖర్గే అయినా వస్తారా.. దేశ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను సాకుగా చూపి.. ఆయన కూడా రాకుండా ఉంటారా.. అన్న ప్రశ్న.. కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
పోవుడు కాదు... పంపించుడే
మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ పోస్టు అమ్ముడుపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత.. వీలు కుదిరినప్పుడల్లా రేవంత్ పై నర్మగర్భ వ్యాఖ్యలు కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు.. రేవంత్ మాత్రం గతంతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తన నోటికి పని చెప్పకుండా.. చేతలతోనే ముందుకు వెళ్తున్నారు.ఇది.. కోమటిరెడ్డికి మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. అందుకే.. అందివచ్చిన అవకాశంగా వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళన సభను తీసుకున్న ఆయన.. మరోసారి నోటికి పని చెప్పారు. తోటి నేతలకు భిన్నంగా నడుచుకుంటూ విజయమ్మ సభకు హాజరయ్యారు. వైఎస్ ను కీర్తిస్తూ.. రేవంత్ అండ్ టీమ్ ను మరింత ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించారు. చూస్తుంటే.. ఆయన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది.పీసీసీ ప్రచార కమిటీ బాధ్యుడు మధు యాష్కీ.. ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. కావాలనుకుంటే కోమటిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. అంతే కానీ.. ఇలా పీసీసీ పరువు తీసేలా వ్యవహరించవద్దని కాస్త గట్టిగానే కామెంట్లు వదిలారు. ఈ సమయంలో కూడా.. కోమటిరెడ్డి గురించి రేవంత్ నోరు మెదిపింది లేదు. ఏది జరిగితే అది.. అన్నట్టుగానే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారు.ఇదే అవకాశంగా మలుచుకుంటున్న కోమటిరెడ్డి.. తనకు తానుగా పార్టీ వీడేది లేదని.. పంపిస్తే వెళ్లిపోయేందుకు సిద్ధమే అని అన్నట్టుగా విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన దూకుడు ఎక్కడివరకూ వెళ్తుంది.. నిజంగానే పీసీసీ కాస్త తీవ్రంగా స్పందించి.. హై కమాండ్ కు ఫిర్యాదు చేసి.. కోమటిరెడ్డిని వదిలించుకుంటుందా.. అన్నది పార్టీ వర్గాలకు మింగుడుపడకుండా ఉంది.

Related Posts