YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

మెరుగైన వైద్య సేవలు అందించాలి - -జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ

మెరుగైన వైద్య సేవలు అందించాలి - -జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ

మెరుగైన వైద్య సేవలు అందించాలి
- -జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ
నిర్మల్
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ వైద్యాధికారులను ఆదేశించారు.సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషంట్, ఐ. సి యు, కోవిడ్, అత్యవసర తదితర వార్డులలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
    అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts