YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వినాయక విగ్రహం ధ్వంసం

వినాయక విగ్రహం ధ్వంసం

కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావుపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మండపం లోకి చొరబడ్డాడు. ఈ క్రమంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేయగా వినాయక విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది.  వినాయక మండపం వద్ద ఉన్న యువకులు గంగాధర్ ను అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాచారెడ్డి పోలీసులు పరిస్థితిని సమీక్షించి మద్యం మత్తులో వీరంగం సృష్టించిన గంగాధర్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో గంగాధర్ మద్యం సేవించి ఇదేవిధంగా వ్యవహరించాడని గ్రామస్తులు తెలిపారు.

Related Posts