YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కల్లు రాకుండా చేసారు

కల్లు రాకుండా చేసారు

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో కల్లు అమ్మవద్దని దాదాపు 50 ఈత చెట్లకు ఈత కల్లు రాకుండా కందెన ఆయిల్ పూత పుశారని బాధితుడి ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో గత ఏడాది కాలంగా ఒక భూ వివాదం కారణంగా 70 గురడీ రెడ్డి సంఘం కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ బహిష్కరణ  చేశారని వారు ఆరోపిస్తున్నారు.   గ్రామాభివృద్ధి కమిటీ మాకు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు.  అంతే కాకుండా కూలీల కోసం,కిరాణ సామాను  కోసంపక్క గ్రామాలకు వెళ్లి తీసుక రావడం జరుగుతుందని  గురడి రెడ్డి సంఘము వారు తెలిపారు. అంతేకాకుండా  మా పట్ట భూములలో ఉన్న ఈత చెట్లు గిస్తున్నారు కానీ మాకు ఈత కల్లు పోయడం లేదు అని తెలిపారు.అయితే  అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ మీ తోటలో  ఉన్న ఈత చెట్లను గీసి మీకు కల్లు పొస్తా అని ముందుకు వచ్చాడు. దాంతో వీడీసీ సభ్యులు గ్రామ బహిస్కరణ చేసిన వారికి ఈత కల్లు నీవ్వు ఎట్లా పోస్తావ్ అని శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన ఈత చెట్లను కల్లు రాకుండా కందెన అనే ఆయిల్ ను ఈత చెట్లకి కల్లు రాకుండా   చేశారని బాధితుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపాడు.   గ్రామాభివృద్ధి కమిటీ వల్ల మా వర్గం  వారు నష్టపోతున్నామని, మాకు ఈత కల్లు పొస్త అని ముందుకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్ ను కుడా  ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. ఎలాగైనా సరైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని గురడి రెడ్డి సంఘము సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Posts