YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి... నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి... నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

హైదరాబాద్
సింగరేణి కాలనీలో బాధిత చిన్నారి కుటుంబాన్ని  బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా మంత్రులు సందర్శించక పోవడం దారుణమని అన్నారు.సింగరేణిలో విచ్చలవిడిగా డ్రగ్స్.మద్యం అమ్మకాలు సాగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లో విఫలమయ్యారు. నిందితున్ని అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడిపించి త్వరగా  శిక్ష    పదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

చిన్నారి చైత్ర హత్యాచారం నిందితున్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం అయన సోమవారం సైదాబాద్ సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బలసినోడికి ఓ న్యాయం చేస్తున్నారు.. గిరిజనులకు న్యాయం జరగడం లేదు. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఈ ఘటన పై ఇప్పటి కి మంత్రులు స్పందించలేదు. గంజాయ్ మత్తులో ఒక దుర్మాగుడు చిన్నారిని హత్యచారం చేశాడు. ప్రభుత్వం లో ఉన్నవారు మనుషులేనా. మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన చర్య. దిశ సంఘటన జరిగినపుడు.ఎదయితే చేశారో. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు.  ఈ పోలీసు కమిషనర్ చవట దద్దమ్మ. కల్లు కంపౌండ్ దగ్గర పని చేయడానికి పనికి రాడు.. కమిషనర్ కు కామన్ సెన్స్ లేదు. ఇప్పటి వరకు చర్య లు తీసుకోలేదు. నిందితుడిని అరెస్టు చేయలేదు. ఇక్కడ గంజాయ్ నడుస్తున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం పెరగడానికి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలు,గంజాయ్ అమ్మకం తో ఇటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. హోంమంత్రి, మంత్రి కేటీఆర్ కు   సిగ్గు లేదు. పక్కన హత్య చారం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదు. దత్తత తీసుకున్న ఈ సింగరేణి కాలనీ ని ఎందుకు సందర్శించడం లేదు. గంజాయ్ అమ్మకాలపై యాక్షన్ తీసుకోవాలి. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాలి. డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ ఉంటే,మద్యానికి బ్రాడ్ అంబాసిడర్ గా కెసిఆర్ ఉన్నాడని అన్నారు. యువకుల మీద దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పోలీసులవైఫల్యం కనబడుతుంది. ప్రశించిన వారిని తొక్కేస్తున్నారు. చిన్నారి కుటుంబాన్ని అమిత్ షా పరమర్శించాలి. ఇక్కడ జరుగుతున్న దారుణాలను తెలియజేస్తాం. దిశ సంఘటన లో ఒక న్యాయం గిరిజనులపై జరిగేతే ఒక న్యాయ మా. ప్రభుత్వం చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Related Posts