YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వారం రోజుల్లో శ్రీవారి సర్వదర్శనం

వారం రోజుల్లో శ్రీవారి సర్వదర్శనం

వారం రోజుల్లో శ్రీవారి సర్వదర్శనం
తిరుమల
మరో వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్  బుకింగ్ ద్వారా సర్వ దర్శనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్ లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకన్లు అయిపోయాయని... భక్తులు ఆందోళనకు దిగడం.. లాఠీచార్జి వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Related Posts