YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

ఈసీబీకి బీసీసీఐ ఆఫర్

ఈసీబీకి బీసీసీఐ ఆఫర్

ముంబై, సెప్టెంబర్ 14,
మాంచెస్టర్‌లో జరగాల్సిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ టెస్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ రద్దు కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోయింది. ఓ అంచనా ప్రకారం, ఈ మొత్తం నష్టం రూ. 407 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ రద్దు తర్వాత ఈసీబీ ఈ మొత్తాన్ని బీసీసీఐ నుంచి డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి, జే షా ఇంగ్లండ్ నష్టాన్ని భర్తీ చేసేందుకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.జైషా ఇచ్చిన ఆఫర్ మేరకు భారత్‌తో ఇంగ్లండ్ టీ 2 టీ 20 లేదా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటం అని తెలుస్తోంది. వాస్తవానికి, వచ్చే ఏడాది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో భారత్ ఆడాల్సిన టీ20ల సంఖ్య కంటే మరో రెండు టీ20లు అదనంగా ఆడటం.. లేదా ఓ టెస్ట్ అదనంగా ఆడవచ్చనే ప్రతిపాదనను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మర ఈసీబీ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తుందా లేదో చూడాలి. ప్రస్తుతానికైతే బంతి ఈసీబీ కోర్టులో ఉందని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు భారత్..
వచ్చే ఏడాది జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ పర్యటనలో, టీమిండియా 3 టీ 20లు, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. జులై 1 న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే టీ 20 మ్యాచ్‌తో ఇంగ్లండ్ పర్యటన ప్రారంభమవుతుంది. రెండవ టీ 20 జులై 3 న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతుంది. మూడో టీ 20 జులై 6 న జరుగుతుంది. దీని తరువాత, 3 వన్డేల సిరీస్ జులై 9, 12, 14 తేదీలలో జరుగుతాయి.
ఈసీబీకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చాం: జై షా
వచ్చే ఏడాది, టీమిండియా ఇంగ్లండ్ పర్యటన గురించి క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. “ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఓ ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, 3 టీ 20 లకు బదులు 5 టీ 20 ల సిరీస్ ఆడతాం. టీ20లు వద్దనుకున్నప్పుడు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకావం ఇచ్చాం. ఈ రెండు ఆఫర్‌లలో ఏది ఈసీబీ ఎంచుకుంటుందో చూడాలి’ అంటూ జైషా పేర్కొన్నారు

Related Posts