YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అర్థరాత్రి కలకలం

అర్థరాత్రి కలకలం

విజయవాడ, సెప్టెంబర్ 14, 
ప్రపంచం మొత్తం అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధివైపు పరుగులు తీస్తుంటే.. మనదేశంలోని ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల మత్తులోనే మునిగిపోతున్నారు. ఆ మూఢ విశ్వాలను అడ్డం పెట్టుకుని జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ బతుకు సాగిస్తున్నారు మరికొందరు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామ శివారుల్లో రాత్రి వేళల్లో గుర్తుతెలియని క్షుద్రపూజలు నిర్వహించారు. అది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన ఓ రెండు కుటుంబాలకు చెందిన అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోంది. గ్రామ పొలిమేరలో అర్థరాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నారు గ్రామస్తులు. వెంటనే వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు.అయితే, గ్రామ ప్రజల రాకను గమనించి పూజలు చేస్తున్న పూజారి, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. వారిని గ్రామస్తులు కొంతదూరం వరకు వెంబడించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో తీవ్ర భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పూజా ప్రాంతంలో వేసిన ముగ్గులో మేకులు, కత్తులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిని గుర్తించారు. అయితే, స్థలం వివాదంలో చేతబడి చేసి చంపేందుకు కట్ర పన్నారని, ఇందులో భాగంగానే పూజలు చేస్తున్నారంటూ అన్నదమ్ముల్లో ఒక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, కత్తులు, కోడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విశ్వాంతరాలను చేధిస్తున్న ప్రస్తుతం టెక్ యుగంలో మూఢ విశ్వాసాలకు తావు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. క్షుద్రపూజల పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Posts