
రంగారెడ్డి
రంగారెడ్డిజిల్లా ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండా శివారులో అర్ధరాత్రి ఓమహిళపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి బండరాయితో తలపై కొట్టి హతమార్చిన సంఘటన చోటుచేసుకుంది. ఆమనగల్లు పోలీసులకు ఉదయం సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్నీ పరిశీలించారు. మృతురాలు మాడ్గుల మండలం చంద్రయాన్ పల్లి గ్రామం కొమ్ము పోచమ్మ (40)గా గుర్తించారు .మృతురాలు నగరంలోని జీహెచ్ఎంసీ పారిశుధ్యకార్మికురాలిగా విధులు నిర్వహిస్తూ రోజు గ్రామం నుంచి బస్సులో వెళ్ళేది. సోమవారం తెల్లవారుజామున విధులకు వెళ్లుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్ళింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో భర్త కొమ్ము గాలయ్య భార్యకు ఫోన్ చేస్తే పనిచేయలేదు. బుధవారం ఉదయం నుచ్చుగుట్ట వద్ద మహిళా మృతదేహం ఉందని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. మహిళను హతమార్చిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.