YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చిన్నారి చైత్రపై లైంగికదాడి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం, మంత్రి సత్యవతి రాథోడ్

చిన్నారి చైత్రపై లైంగికదాడి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం, మంత్రి సత్యవతి రాథోడ్

చిన్నారి చైత్రపై లైంగికదాడి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం, మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్‌ సెప్టెంబర్ 15
సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పనులు, మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహబూబాబాద్ మెడికల్ కాలేజీ కార్యరూపం దాల్చడంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.అధికారులు అంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిర్మాణ పనులు త్వరగా కావాలని ఆర్ అండ్ బి కి అప్పగించాం. రూ.30 కోట్లతో నర్సింగ్ కాలేజీకి టెండర్ పూర్తి అయ్యిందని మంత్రి తెలిపారు.నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాక అందులో ముందు మెడికల్ కాలేజీ నడిపిస్తాం. ఏరియా హాస్పిటల్ లో 300 పడకల ఏర్పాటు చేశాం. అన్ని సర్వీసులు అక్కడ స్టార్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన, నర్సింగ్ కాలేజీ, కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేయడానికి పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.జిల్లా అభివృద్ధిలో మీడియా సహకారం కావాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. చిన్నారి చైత్రను లైంగికదాడి చేసి హత్య చేయడం దారుణ మన్నారు.నిందితుని కుటుంబ సభ్యులు పోలీసుల కంట్రోల్ లో ఉన్నారు. దోషులను పట్టుకుంటాం.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మహబూబాబాద్ లో 3000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉండేది. కొంత ప్రభుత్వ భూమిని పేదలకు అసైన్డ్ చేశాం. భూములలో ఉన్న వారికి న్యాయం చేస్తాం. రికార్డులు లేని వారికే ఇబ్బంది అవుతుంది. అయినా ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఆర్అండ్ బీ పీఎంసీ గణపతి రెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, ఏస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఎస్. ఈ నాగేందర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నేతలు నూకల రంగా రెడ్డి, శ్రీధర్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ఉన్నారు.

Related Posts