YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కి శ్రీశైల దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కి శ్రీశైల దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కి శ్రీశైల దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ
కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున గురువారము రోజు  ఉదయం పట్టువస్త్రాలు సమర్పించబడ్డాయి. సెప్టెంబరు 10వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనున్నాయి.
ఈ మేరకు శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న దంపతులు  పట్టువస్త్రాలను సమర్పించారు. దేవస్థానం పర్యవేక్షకులు స్వాములు, వేదపండితులు శ్రీ గంటి రాధకృష్ణమూర్తి, స్వామి అమ్మవార్ల
అర్చకులు తదితరులు కాణిపాకం చేరుకుని దేవస్థానం తరుపున వస్త్రాలను సమర్పించారు.
 ముందుగా కాణిపాక దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారులు  విద్యసాగర్, కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్, అర్చకులు, వేదపండితులు సాదరంగా  దేవస్థాన అధికారులను ఆహ్వానించారు.తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించడం జరిగింది. అనంతరం దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు. ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వరసిద్ధివినాయక స్వామి బ్రహ్మోత్సవాల సమయము  పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోంది.

Related Posts