YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్షమాగుణం.

క్షమాగుణం.

*తనపై గురి చూసి రాయిని విసిరేవారికి.. ప్రేమతో పండును ప్రసాదించే వృక్షం క్షమాపణకు నిలువెత్తు సాక్ష్యం. మన్నించే మనసే సామరస్యతకు సోపానం. అన్న సత్యం తెలిస్తే... ద్వేషానికి తావులేని సుఖమయ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.*

*బంధువులైనా.. జీవిత భాగస్వాములైనా.. స్నేహితులైనా.. సొంత సంతానమైనా సహోదరులైనా.. మరింత సన్నిహితులైనా అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ అయితే.. దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం..*

*ఈ 'క్షమాగుణ దినోత్సవాన్ని' ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.*

*మానసిక ప్రశాంతత..*

*క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాపణ చెప్పేవారిలో మానసిక పరిపక్వత చెందిన వారిగా భావించొచ్చు. క్షమాపణతో అవతలి వారిలో అపరాథ భావం తొలగిపోతోంది. తద్వారా ఆందోళన పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది.*

*ఒత్తిడికి దివ్య ఔషధం*

*క్షమాపణ మానసిక ఒత్తిడికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులను మహోన్నతి వ్యక్తులగా చెప్పొచ్చు.*

*క్షమాపణతో మనస్పర్థలు తొలగి పోతాయి*

*స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తోబుట్టువుల మధ్య చిన్నచిన్న తగాదాలు ఏర్పడతాయి. కొన్ని వెంటనే సమసిపోతే మరికొంతమంది మాత్రం కొన్నేళ్లపాటు మొహం చాటేస్తారు. వారి మధ్య మనస్పర్థలు ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తే సమస్యలు తొలగి పోతాయి.*

*అందరూ క్షమా గుణాన్ని అలవరచుకుంటే మంచిది.*

*ఉపసంహరంః  క్షమించమన్నారు గా అని నీతి మాలిన దారుణాలకు, అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు.

Related Posts