YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వ్యాక్సినేషన్ పూర్తి చేసే పనిలో అధికారులు

వ్యాక్సినేషన్ పూర్తి చేసే పనిలో అధికారులు

కరీంనగర్, సెప్టెంబర్ 30,
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకోవాల్సిందేనని ఈసీ(ఎలక్షన్ కమీషన్) పెట్టిన నిబంధన ఇప్పుడు వైద్యాధికారులకు కొత్త చిక్కులను తెచ్చింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ సిబ్బందితో పాటు, పోటి చేసే అభ్యర్ధులు, పార్టీల తరపున పనిచేసే కౌంటింగ్ ఏజెంట్లు కచ్చితంగా పోలింగ్ తేదీ గడువులోగా రెండు డోసుల టీకాను పొందాల్సిందేనని ఈసీ చేసిన ప్రకటనతో వైద్యాధికారులు కాస్త టెన్షన్ కు గురవుతున్నారు. అంతేగాక ఆ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలూ రెండు డోసులు వేసుకోవాలన్నది ఈసీ సూత్రపాయ నిర్ణయం. దీంతో ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్ శాతాన్ని చూసి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 2వ తేదీ వరకు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు డోసులు పొందిన వారు కేవలం 28.63 శాతం ఉండగా.. గడిచిన రెండు వారాలుగా చేస్తున్న స్పెషల్ వ్యాక్సినేషన్తో అది 35 శాతానికి పెరిగిందని క్షేత్రస్థాయి మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. సింగల్ డోసు తీసుకున్న వారు మరో 75 శాతం వరకు ఉండొచ్చని వైద్యశాఖ చెబుతున్నది. వీలైనంత వేగంగా టీకాలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లీడర్లు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఏజెంట్లు, ఆఫీసర్లకు గడువులోపు టీకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ కేటగిరీకి చెందినోళ్లలో 80 శాతం మంది టీకా పొందినట్లు వైద్యశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మిగతా వాళ్లందరికీ వేగంగా డోసులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని వైద్యశాఖ పేర్కొంటున్నది.కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ మానిటరింగ్ కోసం ఇద్దరు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు. హుజూరాబాద్ సెగ్మెంట్ను డీఎమ్హెచ్ఓ మానిటరింగ్ చేస్తుండగా, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల బాధ్యతలను డిప్యూటీ డీఎమ్హెచ్ఓలకు అప్పగించనున్నారు. వీరి పర్యవేక్షణలో వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి టీకా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడే డోసులు ఇవ్వనున్నారు. మార్కెట్లు, స్కూళ్లు, పంటపోలాలు, కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసెస్లలో విస్తృతంగా టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
హుజురాబాద్   వ్యాక్సినేషన్  స్టేటస్
మండలం  టార్గెట్        1డోసు     2డోసు
హుజురాబాద్ 59,220   36,773   11,891
జమ్మికుంట 54,877     37,196   11,002
ఇల్లంతకుంట 23,879   19,568    3,726
వీణావంక 38,923       26,377     7715
మొత్తం 1,76,899     1,19,914     34,334

Related Posts