YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 కరోనాతో  ఎన్నో పాఠాలు

 కరోనాతో  ఎన్నో పాఠాలు

 కరోనాతో  ఎన్నో పాఠాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30,
శంలో ప్రతి మూలకూ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని.. దీనికోసమే సరికొత్త జాతీయ ఆరోగ్య విధానానికి నడుంబిగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి గుణపాఠం నేర్పిందని.. దీని మూలంగా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు పూనాది ఏర్పడిందన్నారు. కరోనాను అరికట్టేందుకు, ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు నిమగ్నమయ్యాని.. ఈ తరుణంలో భారత్ బలాన్ని, స్వశక్తి పెంచుకునేందుకు ముందడుగువేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అత్యాధునిక ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యమని.. అందుకే వైద్య కళాశాలలను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ గురువారం రాజస్థాన్‌లో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. దీంతోపాటు జైపూర్ సీతాపురలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ (IPT) ని కూడా ఆయన ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను కొత్తగా రాజస్థాన్లోని బన్స్‌వారా, సిరోహి, హనుమాన్‌గఢ్, దౌసాలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు, ఇనిస్టిట్యూట్‌ గురించి ప్రెజెంటేషన్‌ ద్వారా చూపించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విద్యా రంగం నుంచి వైద్య రంగానికి అనుసంధానంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొదలైనవి సంస్కరణల్లో భాగమేనని ప్రధాని మోదీ అన్నారు. కోరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో చాలా గుణపాఠాలు నేర్పిందన్నారు. ఈ సమయంలో భారతదేశం స్వశక్తితో మహమ్మారిని ఎదుర్కొందని తెలిపారు. అనంతరం ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. దీనిలో భాగంగా కేంద్రం ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిందని.. అందరికీ వ్యాక్సినేషన్ అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 88 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేశంలోని ప్రతి మూలలో ఆరోగ్య సేవలను విస్తరించడంలో సహాయపడుతుందని మోదీ పేర్కొన్నారు. ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఫార్మసీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా.. ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వెనుకబడిన జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Related Posts