YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేక హత్య కేసులో పెద్ద తలకాయలు మిస్

వివేక హత్య కేసులో పెద్ద తలకాయలు మిస్

కడప, అక్టోబ‌రు 6,
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కు ముడులు వీడుతున్నాయి. వివేకా హత్యకు గల కారణాలు ఇంకా తెలియక పోయినప్పటికీ నిందితులెవరన్న దానిపై స్పష్టత వచ్చింది. వివేకానందరెడ్డిని హత్య చేసింది ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లని ప్రస్తుతం సీబీఐ అధికారులు తేల్చారు. వారితో పాటు ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై కూడా త్వరలో స్పష్టత వస్తుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుంది. 2019 మార్చి 15వ తేదీ వివేకా హత్య జరిగింది. వివేకాను ఆయన ఇంటిలోనే అత్యంత కిరాతకంగా దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. గత మూడు నెలల నుంచి సీబీఐ అధికారులు అనేక మంది అనుమానితులను ప్రశ్నించారు. వీరిలో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితులుగా ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లని సీబీఐ అధికారుల విచారణలో వెల్లడయింది.ఉమాశంకర్ రెడ్డిది ఈ హత్యకేసులో ప్రధాన పాత్రగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ఉమాశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి పీఏ జగదీశ్వర్ రెడ్డికి సోదరుడు. ఉమాశంకర్ రెడ్డి పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మహాశివగంగ భవానీ పేరుతో పాలడెయిరీని నిర్వహిస్తున్నారు. వివేకా కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.హత్య జరిగిన రోజు రాత్రి ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హత్య జరిగిన రోజు ముందు రాత్రి బైక్ పై వివేకానందరెడ్డి ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. వివేకా హత్య జరిగిన అనంతరం హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కూడా వారు తీసుకెళ్లారు. వీరిని విచారించిన అనంతరం సీబీఐ అధికారులు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి, మున్నాల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియకరాకపోయినా హత్య చేసింది వీరేనన్న కన్ క్లూజన్ కు సీబీఐ వచ్చింది.

Related Posts