YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

లిక్వీడ్ గంజాయి స్వాధీనం

లిక్వీడ్ గంజాయి స్వాధీనం

నర్సీపట్నం
నాతవరం మండలం గన్నవరం మెట్ట సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వీరిని చూసి తుని వైపు   ప్లాటినా మోటార్ సైకిల్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు  కంగారుపడి,  వేగం పెంచారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని, వారి వద్ద ఉన్న బ్యాగులో తనిఖీలు చేశారు. రెండు బాటిళ్లలో కేజీన్నర లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ పోలీసులు చింతపల్లి మండలం, తమ్మంగుల పంచాయితీ, గొప్పు గుడిసెల గ్రామ శివారులోని లిక్విడ్ గంజాయి తయారు చేసే సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా దీనిని  తయారు చేసే గెమ్మిలి రాంబాబు అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ  ఈ ఘటనకు సంబంధించి తయారీదారుడితో పాటు రవాణా చేసే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. కొనుగోలుదారుడైన తుని మండలం, తాళ్లూరు పంచాయతీ, ఏ.ఎస్. కాలనీకి చెందిన పిల్లి మురళితో పాటు తయారీలో సహకరించే చింతపల్లి మండలం, కరకపల్లికి చెందిన మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్.ఐ శేఖరం పాల్గొన్నారు.

Related Posts