YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నీకెంత... నా కెంత తెలుగు అకాడమీలో వాటలు

నీకెంత... నా కెంత తెలుగు అకాడమీలో వాటలు

నీకెంత... నా కెంత
తెలుగు అకాడమీలో వాటలు
హైదరాబాద్, అక్టోబరు 8,
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా, పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన 10 మందిలో ఒక్కొక్కరు ఎన్ని కోట్లు తీసుకున్నారో ఈ రికార్డులో నమోదయ్యాయి. తెలుగు అకాడమీ భారీ ఎత్తున స్కాం జరిగినట్లు గుర్తించారు. అయితే ఇంత పెద్ద కుంభకోణం జరగడానికి కీలక సూత్రధారి సాయి కుమార్ కారణమని పోలీసులు తేల్చారు.ఈ కేసులో మిగితా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నిందితులు బెయిల్‌పై బయటికి వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. మొత్తం తొమ్మిది పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. సాయికుమార్‌ను కీలక సూత్రధారిగా తేల్చిన పోలీసులు.. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు. భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా సాయి కుమార్ ప్రోత్సహించాడని పేర్కొన్నారు. ఏడాది కాల వ్యవధికి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందన్నారు.డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసిన కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్ రూ.64.5కోట్లను కొల్లగొట్టి వాటాలుగా పంచుకున్నారని వివరించారు. వీరిలో ప్రధాన నిందితుడు సాయికుమార్ రూ.20కోట్లు, సత్యనారాయణ రూ.10 కోట్లు, వెంకటరమణ రూ.7 కోట్లు, రాజ్‌కుమార్ రూ.3 కోట్లు, వేంకటేశ్వర రావు రూ.3 కోట్లు, కృష్ణారెడ్డి రూ.6 కోట్లు, భూపతి రూ.2.5 కోట్లు, రమణారెడ్డి రూ.6 కోట్లు, పద్మనాభన్ రూ.50 లక్షలు, మదన్ రూ.30 లక్షలు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి రూ.2.5 కోట్లు, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన రూ.2కోట్లు, యోహన్ రాజు రూ.50 లక్షలు పంచుకున్నట్టు నివేదికలో స్పష్టంగా తెలియజేశారు

Related Posts