YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గెస్ట్‌ గా వ‌చ్చాను.. గెస్ట్‌ గానే ఉంటాను

గెస్ట్‌ గా వ‌చ్చాను.. గెస్ట్‌ గానే ఉంటాను

హైద‌రాబాద్ అక్టోబర్ 11 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా) ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాకు అధికారికంగా వెల్ల‌డించారు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నాన‌ని తెలిపారు. ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చిన వారు మా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తామ‌ని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించింది. ఓటమిని జీర్ణించుకోలేక తీసుకున్న నిర్ణయం కాదిది. బాధతో కూడా తీసుకోలేదు. జాతీయవాదం, ప్రాంతీయ వాదం నడుమ ‘మా’ ఎన్నికలు జరిగాయి. బండి సంజయ్లాంటి వాళ్లు కూడా ట్వీట్ చేశారు. ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్లో నేను ఉండలేను.  నిన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో చైత‌న్య‌వంతంగా ఓట్లేశారు. తెలుగుబిడ్డ‌ను, తెలుగువాడిని మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. గెస్ట్‌ గా వ‌స్తే గెస్ట్‌ గానే ఉండాల‌ని చాలా మంది చెప్పారు. ఇక నుంచి గెస్ట్‌ గానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ నిర్ణ‌యం బాధ‌తో తీసుకున్న‌ది కాదు. నేను తెలుగు వాడిని కాదు. నా త‌ల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా త‌ప్పు కాదు.. నా త‌ల్లిదండ్రుల త‌ప్పుకాదు అని ప్ర‌కాశ్ రాజ్‌ అన్నారు. లోక‌ల్, నాన్ లోక‌ల్ అజెండా మ‌ధ్య ప‌ని చేయ‌లేను అని ప్ర‌కాశ్‌రాజ్ తేల్చిచెప్పారు. మా లో స‌భ్య‌త్వం లేక‌పోతే సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వ‌రా? అని ప్ర‌శ్నించారు. క‌ళాకారుడిగా నాకు ఆత్మగౌర‌వం ఉంద‌న్నారు. 21 ఏండ్లుగా మాతో అనుబంధం ఉంద‌న్నారు. ప్రాంతీయ‌, జాతీయ‌వాదం నేప‌థ్యంలో ఈ ఎన్నిక జ‌రిగింది. త‌న ఓట‌మికి ప్రాంతీయ‌వాదంతో పాటు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌న్నారు ప్ర‌కాశ్ రాజ్‌.  నటుడు నాగబాబు కుడా ఆదివారం రాత్రి మా సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే.

Related Posts