YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంధకారంలో ఆంధ్రప్రదేశ్

 అంధకారంలో ఆంధ్రప్రదేశ్

 అంధకారంలో ఆంధ్రప్రదేశ్
గుంటూరు
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందని, వచ్చే నెలలో అసలు రాష్ట్రంలో కరెంట్ కూడా ఉండదన్నారు.గుంటూరులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అధానీ ప్రదేశ్‌గా మారిందని విమర్శించారు. ప్రతి ఆదివారం అధానీ తాడేపల్లి వచ్చి వెళ్తుంటారన్నారు. సీఎం జగన్ నవరత్నాలతో ప్రజల నవ రంధ్రాలు మూసి వేశారన్నారు. అసలు నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు ఆగిపోయాయన్నారు. రైతు ఆత్మహత్యలతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉందన్నారు.నవంబర్ 1వ తేదీలోపు ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్ షిప్‌లు చెల్లించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెరవాలన్నారు. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని కొరకుకుంటున్నారన్నారు. జగన్ రెడ్డిది  డిల్లీలో ఓ మాట.. గల్లీలో మరో మాట మాట్లాడతారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి విముక్తి కలిగిస్తామని చింతా మోహన్ అన్నారు.

Related Posts